జ‌గ‌న్, ఉద‌య‌నిధి స్టాలిన్.. ఇద్దరూ ఇద్దరే?!

Publish Date:Feb 9, 2026

Advertisement

హిందూ వ్యతిరేకత విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ ల మధ్య నేనంటే నేను గోప్ప అన్న సంవాదం నడుస్తోందా?  తాజాగా ఇరువురూ చెన్నైలోని ఓ వివాహ వేడుకలో కలుసుకుని పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు జగన్, ఉదయనిథి స్టాలిన్ హాజరయ్యారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ఎందరో అతిరథ మహారథులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారనుకోండి అది వేరే సంగతి. జగన్ ఉదయనిథి స్టాలిన్ ఇరువురూ ఆ వివాహ వేడుకలో కలిసి కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో నెటిజనులు వారి హిందూ వ్యతిరేక వైఖరిపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ఆ ట్రోలింగ్ లో భాగంగానే  స‌నాత‌న ధ‌ర్మం అనేది వైర‌స్ అని భ‌లే అన్నావ్  అని జ‌గ‌న్ రెడ్డి అంటే..  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన నీ ముందు నేనెంత అన్న చర్చ జరిగి ఉంటుందంటూ నెటిజనులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  హిందూ ధర్మంపై వ్యతిరేకత విషయంలో ఉదయనిధి స్టాలిన్, వైఎస్ జగన్ లలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ అన్న డిబేట్ కు కూడా వీరిరువురి భేటీ దృశ్యాలు దోహదం చేశాయి. వీరిరువురిలో ఉదయనిథి స్టాలిన్ ఒక రకంగా బెటర్.. ఆయన ఎటువంటి దాపరికం లేకుండా తన హిందూ వ్యతిరేక వాణిని కుండబద్దలు కొట్టినట్లు బాహాటంగానే వ్యక్తం చేశారు.

ఆ విషయంలో ఆయనకు ఎటువంటి శషబిషలూ లేవు. అయితే జగన్ అలా కాదు.. ఓ పక్క తాను హిందూ వ్యతిరేకిని కానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే.. చేతల్లో తన వ్యతిరేకత చూపుతుంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప‌ర‌కామ‌ణి చోరీ చాలా చిన్న వ్య‌వ‌హారం అనడం. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ అని ధృవపడినా, అందులో జంతువుల కొవ్వు కలవలేదుగా అంటూ బుకాయించడం వరకూ జగన్ హిందూ వ్యతిరేకతను చాపకింద నీరులా కనిపించీ కనిపించకుండా చాటుతున్నారని అంటున్నారు. మొత్తం మీద జగన్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ ఇద్దరే. హిందూ వ్యతిరేకత విషయంలో ఎవరినీ తక్కువ చేయడానికి అవకాశం లేదని అంటున్నారు.  

By
en-us Political News

  
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.