మౌనమేలనోయి.. జగన్ ను నిలదీస్తున్న వైసీపీ క్యాడర్

Publish Date:May 16, 2024

Advertisement

ఏపీలో పోలింగ్ పూర్తయ్యింది. ఓటరు తీర్పు సురక్షితంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలు మరింత భద్రంగా స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్నాయి. పోలింగ్ పూర్తై మూడు రోజులు గడిచినా రాష్ట్రంలో మాత్రం ఇంకా హై టెన్షన్ వాతావరణం అలాగే ఉంది. రాష్ట్రంలోని పల్నాడు, రాయలసీమలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడులతో రగిలిపోతున్నాయి. సాధారణంగా పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొనడం ఆ తరువాత చల్లారిపోవడం సహజమే. అయితే ఈ సారి మాత్రం పోస్ట్ పోల్ హింస పెచ్చరిల్లుతోంది. 

గత ఎన్నికల కంటే రెండు శాతానికి మించి అధికంగా పోలింగ్ జరగడం అధికార వైసీపీలో ఆందోళనకు కారణమైంది. అందుకే ఉదయం చెదురుమదురు సంఘటనలు వినా ప్రశాంతంగా సాగిన పోలింగ్ మధ్యాహ్నానికి వైసీపీ మూకలు చెలరేగిపోవడంతో  హింసాత్మకంగా మారింది. పోలింగ్ సరళిని బట్టి ఆందోళనకు గురైన వైసీపీ అధినాయకత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతోనే వైసీపీ మూకలు పోలింగ్ సజావుగా జరగకుండా, ఓటర్లు ధైర్యంగా క్యూలలో నిలబడి ఓటు వేసే పరిస్థితి లేకుండా చేయడానికి ప్రయత్నించాయన్నది పరిశీలకులు విశ్లేషణ. సరే మళ్లీ అదే పరిశీలకులు హింసాకాండకు బెదరకుండా ఓటర్లు ధైర్యంగా, ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనీ, ఇదే వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలియజేస్తోందని కూడా చెప్పారు.

. అదే పోలింగ్ సరళి తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసిం ది. ఇక అధికార పార్టీ ఆగడాలను మౌనంగా భరించనవసరం లేదన్న ధైర్యాన్ని నింపింది. పోలింగ్ తరువాత పల్నాడు, రాయల సీమలో  వైసీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో తెలుగుదేశం శ్రేణులు నిర్భీతిగా ముందుకు కదలడానికి అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అదే సమయంలో పోలింగ్ తమకు వ్యతిరేకంగా జరిగిందని వైసీపీ కీలక నేతలు, కొందరు అభ్యర్థులూ మీడియా ముందు అంగీకరిస్తున్నారు. పోలీసులు తెలుగుదేశం కూటమికి అన్నివిధాలుగా మద్దతుగా నిలిచారనీ, తమను మాత్రం ఎక్కడికక్కడ నియంత్రించారనీ అంబటి, సజ్జల వంటి వారు ఆరోపణలు గుప్పించారు. సజ్జల అయితే ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పని చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మాటలన్నీ వైసీపీలోని ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా ఎత్తి చూపుతున్నాయి. అలాగే వైసీపీ అడ్డాలుగా చెప్పబడే ప్రాంతాలలో పోలింగ్ అనంతర హింసాకాండను నిలువరించడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినా తెలుగుదేశం కేడర్ ధైర్యంగా నిలబడి అడ్డుకోవడం ఆయా ప్రాంతాలలో మారిన రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వైసీపీ కంచుకోటలను ఓటర్లు బీటలు వారేగా చేశాయనడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక ఎన్నికల తరువాత ఆ పార్టీ అధినేత జగన్ తీరు క్యాడర్ లో ఉత్సాహాన్ని చంపేసింది. ఆయన పూర్తిగా మౌనముద్రలోకి వెళ్లిపోవడం, రేపో మాపో విదేశీ పర్యటనకు రెడీ అయిపోవడంతో క్యాడర్ లో విశ్వాసం సన్నిగిల్లింది.  ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో హింసాకాండను ఖండించాల్సిన బాధ్యత కలిగిన హోదాలో ఉన్నారు. అయినా ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకీ మౌనం అంటూ జగన్ ను వైసీపీ క్యాడర్ నిలదీస్తోంది. ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసిన క్యాడర్ కు ఓదార్పు కలిగేలా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమేమిటన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది.  మరోవైపు విపక్ష నేత చంద్రబాబు ఎన్నికల హింసను ఖండిస్తూ.. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఎన్నిలక సంఘానికి లేఖ రాశారు. కానీ జగన్ వైపు నుంచి అటువంటిదేమీ లేదు.  ఇదే ఆయనలోని నైరాశ్యానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం క్యాడర్ లో ధైర్యాన్ని, స్థైర్యాన్నీ నింపడానికైనా విజయం మనదే అన్న భరోసా ఇవ్వడానికి కూడా జగన్ ముందుకు రాలేదంటే ఫలితంపై ఆయన అభిప్రాయం ఏమిటన్నది అవగతమైపోతోందంటున్నారు.  ఇక జగన్ మౌత్ పీస్ లాంటి సజ్జల బెట్టింగులకు పాల్పడి ఆర్థికంగా నష్టపోకండి అంటూ వైసీపీ క్యాడర్ కు  సలహాలిస్తూ మన సీన్ అయిపోయిందన్న సంకేతాలిస్తున్నారు. 

By
en-us Political News

  
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.