జగన్ హయాం అంతా దోపిడీ రాజ్యమేలింది.!
Publish Date:Jul 11, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లాయరు, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ సారి ఆయన వైసీపీ టార్గెట్ లో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల ఆర్థిక మూలాలు, పార్టీ ఫండింగ్ వ్యవహారాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..వైసీపీ నేతలు..అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు వెనకేశారన్న జడ శ్రవణ్ కుమార్.. వాళ్లు ఎంగిలి మెతుకులను కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని విమర్శించారు. నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను విమర్శలతో తూర్పారబట్టారు. జగన్ ఐదేళ్ల పాలనలో వందల కొద్దీ కాంట్రాక్టులు, మైనింగ్ లీజులు కేవలం పార్టీకి అనుకూలంగా ఉండే క్రోనీ క్యాపిటలిస్టులకు మాత్రమే దక్కాయన్న జడ శ్రవణ్ కుమార్.. ఆ క్రమంలో దాదాపు 5 వేలకోట్ల రూపాయలకు పైగా నిధులు క్విడ్ ప్రో కో పద్ధతిలో పార్టీ ఫండింగ్ రూపంలోకి మారాయన్నారు. మద్యం పాలసీ, ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు 35 శాతం నేరుగా తాడేపల్లి ప్యాలెస్కే చేరిందని సంచలన ఆరోపణలు చేశారు. సాధారణ ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన పన్నుల సొమ్మును ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉపయోగించారన్నారు. ఎంతో నైతికతతో రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకున్న వైసీపీ నేతలు, ఇప్పుడు అడ్డగోలుగా దొరికిపోతున్నారన్న ఆయన.. అమరావతి భూముల వ్యవహారంలోనూ, విశాఖపట్నంలో ల్యాండ్ గ్రాబింగ్ ద్వారా సుమారు రూ. పది వేల కోట్ల విలువైన భూములను వైసీపీ అస్మదీయులు హస్తగతం చేసుకున్నారనీ, దళిత, వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, కేవలం కొద్దిమంది బడా బాబుల జేబులు నింపడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక అక్రమాలపై పూర్తిస్థాయి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరగాలని.. అప్పుడే అసలు దొంగలు బయటపడతారనీ జడ శ్రావణ్ అన్నారు. YSRCP Funding Allegations, AP Politics Shocking Comments, YSRCP Corruption Scandals, Andhra Pradesh Latest News
http://www.teluguone.com/news/content/jada-sravan-kumar-sensational-comments-on-ycp-39-225707.html





