Publish Date:Jul 31, 2025
మాజీ సీఎస్ ఐవైఆర్ కి తత్వం బోధపడింది.. జగన్ కు దిమ్మదిరిగి బొమ్మ కనిపించినట్లేగా?!
మద్యం కుంభకోణం కేసులో జగన్ పూర్తిగా ఇరుక్కున్నట్లే కనిపిస్తున్నది. ఒక్కరొక్కరుగా జగన్ కు సన్నిహితంగా లేదా మద్దతుగా నిలిచిన ఒక్కొక్కరుగా ఆయనకు దూరం జరుగుతూ మద్యం కుంభకోణం కేసులో జగన్ ప్రమేయం ఉందన్న విషయాన్ని పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేరారు.
ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన జగన్ కు గట్టి మద్దతుదారు అనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలి సీఎస్ గా ఆయన చంద్రబాబు హయాంలో పని చేశారు. ఆయన పదవీ విరమణ తరువాత ఆయన కోరిక మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవైఆర్ ను బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ గా నియమించారు. అయితే 2019కు ముందు నుంచీ కూడా ఐవైఆర్ పరోక్షంగా జనగ్ కు సహకరించేలా చంద్రబాబు లక్ష్యంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూవచ్చారు.
ఇక 2019 - 2024 మధ్యా కాలంలో అంటే జగన్ అధికారంలో ఉండగా ఐవైఆర్ పూర్తిగా మౌనం వహించారు. జగన్ విధానాలను ప్రశ్నించకుండా పరోక్షంగా మద్దుత ఇచ్చి సహకరించారు. ఆ తరువాత ఆయన బీజేపీలో చేరారు. అప్పటి నుంచీ ఐవైఆర్ జగన్ కు మద్దతుగా నోరు తెరిచిన సందర్భంలేదు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే కూటమి అధికారంలో కొనసాగాలంటే చంద్రబాబు మద్దతు అనివార్యమైన పరిస్థితి నెలకొని ఉండటమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషణ. ఎందుకంటే జనగ్ ను మద్దతుగా మాట్లాడితే తనకే బూమరాంగ్ అవుతుందన్న ఉద్దేశంతో ఐవైఆర్ మౌనం వహించారని అంటారు. అయితే ఈ ఏడాది కాలంలో ఐవైఆర్ ఎన్నడూ కూడా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు.
కానీ హటాత్తుగా ఇటీవల ఐవైఆర్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో నోరెత్తారు. నోరెత్తడమే కాదు.. ఈ కేసులో జగన్ పీకల్లోతు కూరుకుపోయారనీ, తప్పించుకోవడం కష్టమనీ కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు అధికారంలో ఉండగా జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ముఖ్యంగా ఎక్సైజ్ కమిషనర్ గా అనర్హుడిని నియమించడం ద్వారా దిద్దుకోలేని తప్పు చేశారనీ విమర్శించారు. అ
లాగే మద్యం విక్రయాలలో కేవలం నగదు మాత్రమే అన్న విధానాన్ని కేవలం అవినీతి కోసమే తీసుకువచ్చారనీ, అలాగే నాసిరకం మద్యం బ్రాండ్లను తీసుకురావడం ద్వారా ప్రజల ఆరోగ్యం గుల్ల కావడానికి కారణమై ఘోర తప్పిదానికి పాల్పడ్డానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో జగన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లేననీ, ఆయన తప్పించుకునే అవకాశం లేదనీ ఐవైఆర్ అన్నారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే చాలా చాలా పెద్దదన్ని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆఖరికి ఐవైఆర్ కృష్ణారావు కూడా జగన్ వదిలేశారని అర్ధమౌతోంది. నిజంగానే మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అవ్వడమంటూ జరిగితే.. ఆయనకు రాజకీయంగా కూడా ఎటువంటి సహకారం అందే అవకాశాలు దాదాపు లేవనే పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iyr-also-deserted-jagan-25-203178.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.