వడ్డీకు ఇవ్వడం,  తీసుకోవడం, ఇప్పించడం మహాపాపం

Publish Date:Aug 16, 2024

Advertisement

తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండేది.అప్పట్లో హైదరాబాద్ మహానగరంలో  నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. ఫసల్ బాబా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.  ఐటిలో బిటెక్ చేసినప్పటికీ ఉద్యోగం దొరక లేదు. ఉద్యోగం లేనప్పటికీ మేనరిక సంబంధం రావడంతో పెళ్లి అయితే చేశారు పెద్దలు. ఒక బాబు పుట్టాడు. ఫస్ట్ బర్త్ డే గ్రాండ్ గా చేయాలని భార్య తరపు బంధువులు ఒత్తిడి పెట్టారు. చేసేదేమి లేక ఫసల్ బాబా నూటికి ఐదుపర్సెంటేజి క్రింద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ప్రతీనెలా ఠంచనుగా కట్టకపోతే వడ్డీ రేటు మారుతుందరి ఫైనాన్సియర్ కటువుగానే చెప్పాడు. సరేనన్నాడు ఫసల్ బాబా.
 కొడుకు బర్త్ డే అని అందరికీ ఇన్విటేషన్స్ అయితే ఇచ్చాడు ఫసల్ బాబా. సాయంత్రం బర్త్ డే సెలబ్రేషన్స్ కు అందరూ సిద్దమయ్యారు.  ఆరిఫ్ ప్రముఖ దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. వృత్తి జర్నలిజం. ప్రవృత్తి తక్రీర్ (ప్రవచనాలు) ఇవ్వడం. 
మసీదుల్లో అయితే శుక్రవారం, పండగ రోజుల్లో తక్రీర్ ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతమైతే ఒక తక్రీర్ చెప్పడానికి మౌలానాలు ఐదు వేలు వసూలు చేస్తున్నారు. ఆరిఫ్  మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తక్రీర్ లు చెప్పేవాడు. అదొక సామాజిక బాధ్యతగా భావించేవాడు. అది ధర్మ కార్యంగా భావించేవాడు. 
ఫసల్ బాబా బర్త్ డే వేడుకలకు తీసుకెళ్లడానికి కొందరు యువకులు ఆరిఫ్ దగ్గరికి వచ్చారు. 
యువకులు:  ఆరిఫ్ బయ్ సాల్ గిరాకు వెళ్దామా అన్నారు.
ఆరిఫ్: అవునూ ఫసల్ బాబా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.
యువకులు: ఎక్కడా చేయడం లేదుబయ్ 
ఆరిఫ్: ఫిర్ పైసా కహాంసే లాయా
యువకులు. ఫైనాన్స్ పే
ఆరిఫ్: అయితే నేను రాను. సూద్ కే పైసాసే ఖాయేతే బీ అజమ్ నహీ హోతా. హలాల్ కే పైసా హజమ్ హోతా..యేతో హరామ్ కా పైసా హై. వో ఖానా జహర్ బన్ తా 
ఆరిఫ్ :   సూద్ పే  పైసా లేనే వాలా.. సూద్ పే  పైసా దేనేవాలా.  సూద్ పే  పైసా దిలానే వాలా.. తీనో డేంజర్ హై.. బచ్చో కా ఖేల్ హై క్యా.. సూద్ పే అల్లా జంగ్ కరేగా... మేరే ప్యారే బాయ్.. అల్లా కే వాస్తే మత్ కరో... అల్లా మదత్ నై కరేగా..
సూద్ కా పైసే సే  బచ్చీయోంకీ షాదీ కర్నా హరామ్ హై.. హమ్ ఖుదా కే ఖిలాఫ్ జాకే కామియాబ్ నహీ హో సక్తే మేరే భాయ్.. బ్యాంక్ సే లోన్ లేనా జాహెజ్ హై.. మగర్ ఫైనాన్సర్ సే  లేనా మనా హై..
 వడ్డీల ప్రస్తావన వచ్చినప్పుడు ఆరిఫ్ తక్రీర్ ఇలా సాగేది. 
హైదరాబాద్ జర్నలిస్టులకు ఆరిఫ్ పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు. ఆరిఫ్ విలక్షణమైన వ్యక్తి. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అని బలంగా నమ్మే జర్నలిస్ట్  ఆరిఫ్ 

 90 దశకం ఆరంభంలోనే ఆరిఫుద్దీన్ అహ్మద్ అనే జర్నలిస్ట్ ఆంధ్రప్రభ హైద్రాబాద్ ఎడిషన్ లో చేరాడు. అప్పటికే దాసరినారాయణరావు ఉదయం తెలుగు దినపత్రికలో  రిపోర్టర్ గా అనుభవం గడించిన ఆరిఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉండేవి. రాజస్థాన్ కు చెందిన రామ్ నాథ్ గోయంకా యాజమాన్యంలో వస్తున్న ప్రచురణల్లో తెలుగు ఎడిషన్ ఆంధ్రప్రభ,  ఇంగ్లీషులో ఇండియన్ ఎక్స్ ప్రెస్ దోమలగూడ నుంచి ప్రచురణ అయ్యేవి. కన్నడప్రభ మాత్రం బెంగుళూరు నుంచి వచ్చేది. నైతిక విలువలు, వ‌ృత్తి ప్రమాణాలు పాటించే పత్రికగా మార్కెట్లో పేరుండేది. వామపక్షభావజామున్న జర్నలిస్ట్ లు ఉదయం వంటి పత్రికల్లో చేరితే రైటిస్ట్ భావజాలమున్న జర్నలిస్ట్ లకు మాత్రం ఆంధ్రప్రభ వేదికయ్యేది. ఈనాడు, ఉదయం పత్రికల్లో సెంట్రల్ డెస్క్ అనుభవం గడించిన శంకరనారాయణ వంటి లబ్ద ప్రతిష్టులు ఆంధ్ర ప్రభలో ఫన్ గన్ కాలమిస్ట్ గా చేరిపోయారు. హస్యం, వ్యగ్యం ఉండే ఈ ఫీచర్ కు  చాలా కాలం జీవం పోసింది శంకరనారాయణ మాత్రమే. హాస్యావధానాలతో తెలుగు ప్రజలను పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించే  శంకరనారాయణకు  ఫోర్త్ ఎస్టేట్ అయిన  మీడియాలో విశేష గౌరవం ఉండేది. ఆరిఫ్ సెటైరికల్ గా చెప్పడాన్ని ఆయన పకపకానవ్వేవారు.  అంతకుముందు ఉదయం పత్రికలో ఆరిఫ్, శంకరనారాయణ కల్సి పని చేయడం వల్ల ఇద్దరి వేవ్ లెంగ్త్  బాగా  కలిసింది. ఆరిఫ్ లో ఉండే హైదరాబాద్ యాక్సెంట్ సెటైర్ వల్ల సీనియర పాత్రికేయులు పలువురు దగ్గరయ్యారు. ఆరిఫ్ చెప్పే హస్యోక్తులు వారిని ఆకర్షిచేవి. ఆంధ్రప్రభ డిప్యూటి ఎడిటర్  ఎంవిఆర్ శాస్త్రి, ప్రెస్ అకాడమీ పూర్వ చైర్మన్ దేవులపల్లి అమర్ వంటి  కాకలు తీరిన జర్నలిస్ట్ లకు  కూడా ఆరిఫ్ అంటే ఎంతో ఇష్టపడేవారు. పోలీస్ స్టేషన్ వద్ద సెంట్రీ , గవర్నమెంట్ ఆఫీస్ లో చప్రాసి నమస్తే చేయకపోతే ఆ వ్యక్తి ఈ సొసైటీకి పనికి రాడు అనే ఆరిఫ్ వాదన. మనుషుల తీరు తెన్నులను బాగా స్టడీ చేసే వాడు.    ఆరిఫ్ కు తెలుగు భాషా ప్రావీణ్యం పెద్దగా లేకపోయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో సిద్దహస్తులు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు రాస్తూ పాలకుల మెడలు వంచి పని చేయించేవాడు. ప్రతీముస్లిం  తన జీవిత కాలంలో మక్కా వెళ్లాలని ఇస్లాం చెబుతుంది. మహమ్బద్ ప్రవక్త జన్మించిన ప్రదేశాన్ని చూడాల్సిందే నని నిర్ణయించుకున్న ఆరిఫ్ తన కష్టార్జితంతో చిన్న తనంలోనే మక్కా సందర్శించాడు.ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న ఆరిఫ్ ఇస్లాం మార్గదర్శకాలను అనుసరించేవాడు. ప్రతీ రోజూ ఐదుసార్లు నమాజ్ పక్కా చేసే వాడు. ఓ పక్క వృత్తి ప్రమాణాలు పాటిస్తూనే ఇస్లాం పునాదుల మీద నిలబడే వ్యక్తిగా ఆరిఫ్ పేరు గడించాడు.  జర్నలిస్ట్ గా సమాజానికి ఆరిఫ్ చేసిన సేవలకు గుర్తింపు లభిస్తున్న సమయమది. ప్రస్తుత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ కూడా ఆరిఫ్ ను పేరు పెట్టే పిలిచేంతగా గుర్తింపు సంపాదించాడు. ఆ రోజుల్లో ఆరిఫ్ తక్రీర్ విని మారిపోయిన వారు ఉన్నారు.  వారు చెడు వ్యసనాలకు దూరమయ్యే వారు. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆరిఫ్ తక్రీర్ ఉపయోగపడేది.  వడ్డీలు తీసుకోవడం, వడ్డీలకు ఇవ్వడాన్ని  ఆరిఫ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడు. వడ్డీలకు ఇప్పించేవారిని కూడా ఆరిఫ్ అంతే దూరంగా పెట్టేవారు. వారిని  కాఫీర్ అంటారని చెప్పేవాడు. కాఫీర్ అంటే దేవుడుని నమ్మని వారని అర్థం.   స్వంత ఇంటి కోసం ఎవరైనా  స్థలాలు కొనుగోలు చేసే సమయంలో తమ వద్ద ఉన్నబంగారాన్నిఅమ్మేసి  కొనుగోలు చేయాలని ఆరిఫ్ సూచనచేసే వాడు.వడ్డీలకు తెచ్చి కొనుగోలు చేయొద్దనేవాడు.  రామ్ నాథ్ గోయంకె నుంచి ఆంధ్ర ప్రభ మేనేజ్మెంట్ మారడంతో ఆరిఫ్ ఉద్యోగం కోల్పోయాడు. ఇదే సమయంలో  ఆంధ్రప్రదేశ్ లో హిందుజా సంస్థ ఇన్ కేబుల్ టీవీ ప్రసారాలు  చేస్తోంది. ఎపి ఫ్రాంచైజ్ తీసుకున్న ఆర్వీఆర్ చౌదరి తన సంస్థలో క్రైంబ్యూరో చీఫ్ ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం కోసం కనీసం అప్లికేషన్  కూడాపెట్టుకోలేదు.  ఆరిఫ్ జర్నలిజంలో చేసిన సేవలను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించారు   ఆర్వీఆర్ చౌదరి. ఇటీవల అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి తన తక్రీర్ మాత్రం ఆపడం లేదు ఆరిఫ్ . 

-బదనపల్లి శ్రీనివాసాచారి 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.