జమిలీ పై తొలిఅడుగు .. ఇక్కడ నుంచి ముందడుగు అనుమానమే!?

Publish Date:Dec 19, 2024

Advertisement

భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల ప్రక్రియ లో తొలి అడుగు వేసింది. 129వ రాజ్యాంగ సవరణకు ప్రథమ అంకాన్ని పూర్తి చేసింది.  వారం క్రితం  వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్  ఆమోదించిన అనంతరం దీనిని పార్లమెంట్ లో  ప్రవేశపెట్టింది.  220-148 ఓట్లతో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి లభించింది. దాంతో జేపీసీ కి బిల్లు పంపడానికి మార్గం సుగమం అయింది. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లుపై కేవలం ప్రజలు,అధికారులు,మాజీ స్పీకర్లు తదితరుల  అభిప్రాయాలను సేకరిస్తుందే తప్ప నిర్ణయం తీసుకోదు. దానికి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే గడువు పోడిగిస్తారు.ఈ కమిటీలో 31 మంది సభ్యులుంటారు. అత్యధికంగా అధికారపార్టీ సభ్యులు ఉంటారు.

ఈ బిల్లుకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాలలోని టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటు వేశాయి.  బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,సమాజ్ వారీ పార్టీ, వామపక్షాలు సహా ఇండియా కూటమి పార్టీలు ఓటు వేశాయి.జమిలీ ఎన్నికలకు ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలి. 129వ రాజ్యాంగ సవరణ చేయాలంటే సభలో మూడింట రెండు వంతుల మేజార్టీ లభించాలి.  .అలాగే 82ఏ నిబంధన, 83 నిబంధన, అసెంబ్లీ ఎన్నికల కాలపరిమితికి 172వ నిబంధన, 327 నిబంధన లకు పార్లమెంట్ ఆమోదిస్తేనే జమిలీ ఎన్నికలు సాధ్యమౌతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుత లోక్ సభ  ఎన్నికల తర్వాత రాష్ట్ర పతి గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. అప్పటి నుంచి ఐదేళ్ల కాల పరిమితి లెక్కిస్తారు. ఆ తరువాతే జమిలి ఎన్నికలు .అంటే టెక్నికల్ గా 2034 వరకూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదు.  పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 67 శాతం మంది సభ్యుల  మద్దతు అవసరం. అంటే 362మంది లోక్ సభలో,164మంది రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు పలకాల్సి ఉంటుంది. కాని 543 సభ్యులున్న లోక్ సభ లో ఎన్డీఏకు 293, ఇండియాకూటమి 234 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో245 సభ్యుల్లో ఎన్డీఏకు 125,మిగిలిన పార్టీలకు 88 మంది సభ్యుల బలం ఉంది.

ఈ పరిస్థితుల్లో రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం. ఈ బిల్లు చట్టమయితే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఇవి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సారి జరుగుతాయి. కాని ఐదేళ్ల కాలపరిమితి లోగా అసెంబ్లీలో  అధికార పార్టీ బలం తగ్గితే ఏమి చేయాలన్న దానిపై స్పష్టత లేదు. .అలాగే పార్లమెంటులో హంగ్ ఏర్పడి మధ్యలో ప్రభుత్వం కుప్ప కూలితే మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఉంటుందా? అప్పుడు అసెంబ్లీల పరిస్థితి ఏమిటని ప్రశ్నకూ సమాధానం లేదు. జమిలీ  ప్రస్తావన రాజ్యాంగంలో లేకపోవడం కూడా  ఒక అవరోధమేనని చెప్పాలి. అన్నిటికీ మించి జమిలి ఎన్నికలు అన్నది ఏదో కొత్తగా కొండను తవ్వి కనుగొన్నది కాదు.  స్వాతంత్య్రానంతరం 1952,1967లలో దేశంలో జరిగినవి జమిలి ఎన్నికలే. కనుక జమిలి అంటూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న హడావుడి అఃసంబద్ధంగానే కనిపిస్తోంది. రాష్ట్రాలలో లేదా కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత లేకుండా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ చేస్తున్న హడావుడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.