ఇరాన్ అమెరికా షరతులకు నిజంగానే అంగీకరించిందా?

Publish Date:Jun 13, 2026

Advertisement

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ..  అంతర్జాతీయ వేదికపై   దౌత్యపరమైన డ్రామా నడుస్తోంది. ఇరుపక్షాల నుండి వస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టడానికి..  అణు ఆయుధాలను ఉపసంహరించుకోవడానికీ అంగీకరించిందంటూ అగ్రరాజ్యాధినేత ట్రంప్ ప్రకటనలు, వాటిని ఖండిస్తూ వెంటనే ఇజ్రాయెల్ చేస్తున్న ప్రకటనలు ప్రపంచ దేశాలను గందరగోళంలోపడేస్తున్నాయి. అణుకార్యక్రమాన్ని పక్కన పెట్టేయడానికి ఇరాన్ అంగీకరించిందా అనే చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ హాట్ గా సాగుతోంది.  ఇరాన్, అమెరికా  శాంతి ఒప్పందానికి సంబంధించి వైట్ హౌస్ అధికారులు  సంచలన ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ ఒక కఠినమైన  పనితీరు ఆధారిత ఒప్పందానికి అంగీకరించిందనీ..  దీని ప్రకారం ఆ దేశంపై ఉన్న ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలంటే..  ముందుగా ఇరాన్ భారీ రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా పేర్కొంది.

వైట్ హౌస్ నివేదికల ప్రకారం..  ఇరాన్ వద్ద ఉన్న అణు ఇంధనాన్ని పూర్తిగా నాశనం చేసి, అక్కడి నుండి తరలించాల్సి ఉంటుంది. అలాగే వారి అణు కార్యక్రమాలను  నిలిపివేయాలి. ఇరాన్ ఈ నిబంధనలన్నింటినీ నెరవేర్చే వరకు అమెరికా   ఆంక్షలను ఎత్తివేయదు సరే కదా.. వారి నిధులను కూడా విడుదల చేయదు.  దీనితో పాటు, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ) సముద్ర మార్గాన్ని ఎల్లప్పుడూ తెరిచే ఉంచడానికి, అలాగే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం నిలిపివేయడానికి కూడా ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, దీనికి ప్రతిగా అమెరికా తన సైనిక చర్యలను పూర్తిగా ఆపాల్సి ఉంటుంది. కానీ.. వైట్ హౌస్ ప్రకటనలను  ఇరాన్ నిర్ద్వంద్వంగా  ఖండించింది. తాము ఎలాంటి కఠినమైన నిబంధనలకు, షరతులకు అంగీకరించలేదని కుండబద్దలు కొట్టేసింది.

ఈ దౌత్య యుద్ధం ఇలా సాగుతుండగానే..  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడిందన్నది ఆయన ఆరోపణ. ఈ విఫల దాడులు ముమ్మాటికీ ఆమోదయోగ్యం కాదని ట్రంప్ మండిపడ్డారు.  ఇరాన్ దాడులకు పాల్పడిందనే విషయానికి సంబంధించి ట్రంప్ ఎలాంటి నిర్దిష్ట ఆధారాలను మీడియా ముందు ఉంచలేదు. దీనిపై ఇరాన్ అధికారులు కూడా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

మరోవైపు శాంతి చర్చల వివరాలను ఇరాన్ మీడియాకు లీక్ చేస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలకు చెబుతున్న విషయాలకు, తెరవెనుక ఇరు దేశాలు రాతపూర్వకంగా అంగీకరించిన అసలు నిబంధనలకు అస్సలు సంబంధం లేదని  వాదించారు. ఇరాన్ చర్చల్లో నిజాయితీగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ..  ఇరాన్ త్వరగా తన వైఖరిని మార్చుకోవాలంటూ..  హెచ్చరించారు.  మొత్తం మీద ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం విషయంలో రెండు దేశాలూ చేస్తున్నపరస్పర విరుద్ధ ప్రపకటనలు ప్రపంచ దేశాలను గందరగోళంలో పడేస్తున్నాయి.  

By
en-us Political News

  
ట్విస్ట్ ఏంటంటే, 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. దేవినేని అవినాష్ అధికార పార్టీలో చక్రం తిప్పినప్పటికీ ఈ పిల్ల సాయిపై ఉన్న రౌడీ షీటును ఎత్తేయించలేదు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి ఉంటే.. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రౌడీ షీట్ ఎందుకు తొలగించలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ భారీ ఈవెంట్‌లో వందలాది మంది అమెరికన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నేషనల్ మాల్ మొత్తం ఒక పెద్ద బహిరంగ యోగా శిబిరంగా మారిపోయింది.
బాపూ సరోవర్ నిర్మాణానికి అవసరమైన అత్యంత కీలకమైన రక్షణశాఖ భూముల బదలాయింపునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం (జూన్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 550 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టతలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యం...కొత్త వ్యూహాలతో జనసేన ముందడుగు!
సాయికృష్ణ కేసులో దోషులపై కఠిన చర్యలు..
లింగంగుంట్ల నుంచి నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
హైదరాబాద్ శివార్లలోని గండిపేట పరిధిలో వెలుగుచూసిన సంచలనాత్మక నకిలీ జీఓల భూ కబ్జా కేసు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది
గుజరాత్‌లో డెయిరీ క్వీన్ గా ఎదిగిన మహిళా ప్రస్థానం..
మసూరీ టూర్‌లో వైజాగ్ మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి.. భర్తపైనే తల్లిదండ్రుల అనుమానాలు!
పాఠశాల వార్షికోత్సవంలో పాక్ దేశభక్తి గీతం..
హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ (NEET) పరీక్ష వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.