Publish Date:Jan 27, 2025
జయ శంకర్ భూ పాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం టెంపుల్ ఇన్ చార్జి,ఈ వో మారుతీపై వేటుపడింది. సింగర్ మధు ప్రియ గర్బగుడిలో డాన్స్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. జనవరి 20 వతేదీన సింగర్ మధు ప్రియ ఆలయ ఈవో పర్మిషన్ తీసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. మధుప్రియకు ఉన్న పాపులారిటీ వల్లే ఈవో అనుమతించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆమె తప్పించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక యూ ట్యూబర్ గా తాను ఆలయ ఈవో పర్మిషన్ అడగడం వెంటనే అనుమతినివ్వడం మధు ప్రియకు అనుకూలంగా మారింది. కాళేశ్వరం టెంపుల్ ఇన్ చార్జి అయిన ఈవో మారుతీ నిర్లక్ష్యం వల్లే సింగర్ మధు ప్రియ డాన్స్ చేసినట్టు దేవాదాయ శాఖ గుర్తించింది. ఈ కారణంగానే ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఈవోను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సింగర్ మంగ్లీ కూడా శ్రీకాళహస్తిలో ఇదే తరహా ఫోట్ షూట్ చేసి వివాదాస్పదమైంది. సింగర్ మధు ప్రియ అయితే శృతిమించింది. ఏకంగా గర్బ గర్బగుడి తలుపులను మూసేసి సింగర్ మధు ప్రియ డాన్స్ చేసింది. ఇప్పటికే ఆలయ పూజారిని బాధ్యుడు చేస్తూ రామకృష్ణకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఈవోను ఏకంగా విధుల్లో నుంచి తొలగించారు. ఆలయ ఈవోను విధుల్లో నుంచి తొలగించడం మధు ప్రియకు సేఫ్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.. ఈ వ్యవహారంలో ఇంత వరకు మధుప్రియ స్పందించకపోవడం గమనార్హం. దేవాదాయ శాఖను టార్గెట్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళ చేస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ ఉద్యోగిసిబ్బందిపై చర్య తీసుకోవడం ప్రారంభమైంది. అయితే మధు ప్రియపై చర్య తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ శాఖ అయిన ఐ ఆండ్ పిఆర్ లో పని చేసే మధు ప్రియ ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించడంతో సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-singer-madhu-priya-not-arrested-in-garbagudi-dance-case-25-191905.html
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది