ఉట్టికెగరలేనమ్మ స్వార్గానికి నిచ్చెనేసినట్లేనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ

Publish Date:Oct 7, 2022

Advertisement

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసిందట.. అలా ఉంది.. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీ అనడం. ఎవరు ఔనన్నా కాదన్న టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ.. ఎంత గొప్పలు చెప్పుకున్నా.. దేశ్ కీ నేతా అంటూ దేశ వ్యాప్తంగా ప్లెక్సీలూ పోస్టర్లూ ఏర్పాటు చేసి మీడయాలో ప్రచారం చేసినా కేసీఆర్ ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీ నాయకుడే. ఆయన క్షేత్ర స్థానం తెలంగాణయే. ఇక తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎగరాలంటే.. ముందుగా ఆయనకు కావలసింది.. లోక్ సభ స్థానాలు. తెలంగాణలో ఉన్నవి కేవలం 17 లోక్ సభ స్థానాలు మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆయన పార్టీ గెలిచింది తొమ్మిది స్థానాలు మాత్రమే.

దేశ వ్యాప్తంగా ఉన్న లోక్ సభ స్థానాలు 542. అంటే తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని ఏకంగా పార్టీ పెట్టిన కేసీఆర్ కు తన సొంత రాష్ట్రంలో ఉన్నవి కేవలం 17 లోక్ సభ స్థానాలు. సరే ఆయన కరిష్మాతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలలోనూ తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోగలిగినా మొత్తం లోక్ సభ స్థానాలలో ఆయనకు వచ్చే స్థానాల సంఖ్య ఎక్కువలో ఎక్కువ మూడు శాతానికి మించదు. ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ పెట్టి నెగ్గుకు వద్దామని కేసీఆర్ భావించడం నేల విడిచి సాము చేయడంలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు. తెరాస అధినేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ ఎనిమిదేళ్లలో ఆయన ఎన్నడూ ప్రాంతీయ వాదాన్ని దాటి ఒక్క అడుగు పక్కకు వేసి దేశం మొత్తం అనే యోచన చేసిన దాఖలాలు లేవు.

దేశం విషయం ఎందుకు పొరుగున ఉన్న సాటి తెలుగు రాష్ట్రం ఏపీ గురించి ఒక్క మంచి ముక్క చెప్పిన పాపాన పోలేదు. ఎంత సేపూ ఎన్నికలు , గెలుపు వ్యూహాలతో ఆంధ్ర, తెలంగాణ మధ్య ఎడాన్ని పెంచడానికే ప్రయత్నించారు. నీళ్లు, ప్రాజెక్టులు, విభజన సమస్యల పరిష్కారం ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా ఏపీకి న్యాయం జరగడానికి అవకాశం లేని ఎత్తుగడలనే అవలంబించారు.

తెలంగాణా చాలా చిన్న రాష్ట్రం. కేవలం 17 లోక్ సభా స్థానాలు ఉన్నాయి. లోక్ సభ మొత్తం సీట్ల సంఖ్య 542. అందులో కేవలం మూడు శాతమే లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం నుంచి ఒక నాయకుడు ఏకంగా దేశాన్నే ఏలాలని యత్నం చేయడాన్ని ‘ఉట్టి ఎక్కగలిగామ( తెలంగాణలో అధికారం)నే సంబరంతో స్వర్గానికి నిచ్చెన వేసిన చందంగా ఉందని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేసి, జాతీయ రాజకీయాల్లో తనకు కీలక పాత్ర దొరికినట్లు కేసీఆర్ సంబరాలు చేయడం వినోదాన్ని కలిగిస్తోందంటున్నారు. నిజమే దేశంలోని అత్యంత ధనిక పార్టీలలో తెరాస ఒకటి. అందులో సందేహం లేదు. గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కానీ, జాతీయ రాజకీయాలలో అత్యధిక కాలం చక్రం తిప్పి, ఎక్కువ కాలం అధికారంలో ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కానీ ఆ విషయంలో అంటే ధనిక పార్టీ అన్న విషయంలో  కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ తో పోటీలో లేవు.

అందుకే జాతీయ పార్టీ సారథిగా ఆయన పర్యటనల కోసం ఏకంగా సొంత విమానాన్నే కొనుగోలు చేయడానికి కేసీఆర్ నిర్ణయించారు. అంతేనా దేశ వ్యాప్తంగా అన్ని భాషలూ, రాష్ట్రాలలో పెద్ద ఎత్తునప్రకటనలు జారీ చేయగలిగారు. నిజమే  అధికారికంగా టీఆర్ఎస్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 860 కోట్లున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైట్ మనీకి కనీసం పది పదిహేను రెట్ల నల్లధనం ఉండడం సహజమేనని అంటుంటారు. అందుకే పార్టీ పేరు పెట్టక ముందే ఢిల్లీలో ఓ భారీ భవంతిని తీసుకొని రంగులతో కేసీఆర్ ముస్తాబు చేయించారు. దేశవ్యాప్తంగా తిరిగేందుకు  సొంత విమానం కూడా ఏర్పాటు చేసుకోగలిగారు.

అయితే.. జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో కేసీఆర్ కు స్పష్టత ఉన్నట్లు మాత్రం కన్పించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. జాతీయ రాజకీయ పార్టీని స్థాపించి కేసీఆర్ మోడీని ఢీ కొనాలని నిర్ణయించారు.  బలవంతుడైన శత్రువును ఢీకొనవలసి వచ్చినప్పుడు చుట్టు పక్కల వారందరినీ కలుపుకొని జట్టు కట్టాలి. మోడీతో శత్రుత్వం ఉన్న ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి జాతీయ శక్తులను సమీకరించాలి. కానీ కేసీఆర్ ఆ ప్రయత్నం చేయలేదు.  జాతీయ పార్టీ అంటే కనీసం ఆరేడు రాష్ట్రాల్లో సొంతంగా పోటీచేసే శక్తి ఉండాలి. ఆ శక్తి కేసీఆర్ కు లేదని ప్రత్యేకంగా చెప్పక్కర లేదంటున్నారు.  పొరుగు రాష్ట్రాలు ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలలో కూడా కేసీఆర్ కు ఏమాత్రం పట్టు ఉన్న దాఖలా లేదు. డీఎంకే పార్టీ పలుమార్లు ఆంధ్రలో పోటీ చేసింది. కానీ ఒక్కసారి కూడా డిపాజిట్ దక్కించుకున్న చరిత్ర లేదు. కేసీఆర్ పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఉండే అవకాశం లేదంటున్నారు. సాటి తెలుగురాష్ట్రం అయిన ఏపీలోనే ఆయనకు ఆదరణ లభించే అవకాశాలు మృగ్యం. అటువంటి కేసీఆర్ జాతీయ పార్టీకి ఇతర ప్రాంతాలలో ఆదరణ లభిస్తుందని ఎలా భావించగలం అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద.. జాతీయ పార్టీ ప్రకటన ద్వారా కేసీఆర్ దుస్సాహసానికి పాల్పడ్డారనే అంటున్నారు.

ఆ సంగతి పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ విషయంలో కేసీఆర్ కొత్త పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అని పరిశీలిస్తే ఆయనతో కలిసి వచ్చేవారు ఒక్కరూ కన్పించడం లేదని అంటున్నారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ కేంద్రంలో మోడీతో స్నేహం కోసం తహతహలాడుతున్నాయి. ఆ పార్టీల అధినేతలు మోడీని ఎదిరించే సాహసం చేయరు. అందుకే ఎన్నికల పొత్తు లేకపోయినా, బీజేపీతో కలిస్తే తనకు బలమైన ముస్లింలలో అసంతృప్తి వస్తుందని తెలిసినా మూడేళ్లుగా లోక్ సభ, రాజ్యసభలలో బీజేపీ వైపే జగన్ నిలబడుతున్నారు. మోడీ అడగకుండానే మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదంటున్నారు. ఒకసారి మోడీని ధిక్కరించి, జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టి విఫలం అయ్యారు. అందువల్ల అలాంటి దుస్సాహసం మరోసారి చేసే అవకాశం ఉండకపోవచ్చు.

కేసీఆర్ ఉద్యమం, టీఆర్ఎస్ పుట్టుక ఆంధ్రుల మీద ద్వేషంతో నడిచినవే. ఆంధ్రులు తమ నీళ్లు దొంగిలిస్తున్నారని, తమ ఉద్యోగాలు ఎత్తుకుపోతున్నారని, తమ నిధులు తరలిస్తున్నారని ఆగం చేసి మరీ కేసీఆర్ తెలంగాణా రాష్ట్రం సాధించారు. ఆంధ్రుల ప్రయోజనాలకు విరుద్ధ పోకడ గల పార్టీకి ఆంధ్రలో కాలుపెట్టే ఛాన్స్ లభిస్తుందని ఊహించడానికి కూడా వీలుకాదు. అందువల్ల కేసీఆర్ కొత్త  పార్టీకి ఏపీలో ఎలాంటి బలమూ రాకపోవచ్చని అంటున్నారు. రాజకీయ నిరుద్యోగులు ఎవరైనా అక్కడక్కడా బీఆర్ఎస్ పార్టీ శాఖలు ప్రారంభించవచ్చు. కానీ అవి పేరుకు మాత్రమే అంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రులను కేసీఆర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా రాష్ట్రానికి వస్తావ్ బిడ్డా అంటున్నారు ఆంధ్ర ప్రజలు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.