ఒకనాటి హీరో... ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేశ్, పవిత్ర లోకేశ్ ఇద్దరు మళ్లీ పీటలెక్కబోతున్నారంటూ ఇ ఓ ప్రచారం అయితే గత కొంత కాలంగా జోరుగా సాగింది. కొత్త ప్రారంభం.. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలంటూ.. ఈ జంట.. కన్నుల పండగగా.. అదీ కొవ్వొత్తల వెలుగులో లిప్‌లాక్ చేసుకొంటూ ఓ వీడియో నూతన సంవత్సరం ప్రారంభ వేళ.. విడుదల చేశారు. సదరు వీడియో చివరల్లో.. గెట్టింగ్ మ్యారీడ్ సూన్ అంటూ మూక్తాయింపు ఇవ్వడంతో ఇంత కాలం జోరుగా సాగిన ప్రచారం వాస్తవమే అని అందరూ అనుకున్నారు. అంతేకాదు దీనికి మళ్లీ పెళ్లి అనే ప్రకటనతోపాటు #పవిత్రానరేశ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సదరు వీడియో విడుదల కావడంతో వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని కన్ ఫర్మ్ చేసేసుకున్నారు.
అయితే ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం ఈ వీడియో కేవలం పబ్లిసిటి జిమ్మిక్కేనని అంటున్నాయి. మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నరేశ్, పవిత్రా లోకేశ్ జంట కలిసి నటిస్తున్నారని.. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగానే దీనిని విడుదల చేశారని.. ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నరేశ్, పవిత్రా లోకేశ్‌లు ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. మరో వైపు నరేశ్ భార్య రమ్య రఘుపతి.. ఈ జంటని కర్ణాటకలోని మైసూర్‌లోని ఓ హోటల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొవడానికి సంబంధించిన వీడియోలు.. ఇటీవల హల్ చల్ చేసిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలోనే నరేశ్, పవిత్రా లోకేశ్‌తో ఓ వీడియో తీసి వదిలితే.. మంచి పబ్లిసిటి వస్తోందనే ఆలోచనతో ఈ వీడియోను రూపొందించార ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఓ వదంతిని జస్ట్ అలా వదిలితే.. వచ్చే పబ్లిసిటి అలా ఇలా కాదు.. ఓ రేంజ్లో ఉంటుందనే ఓ ఆలోచనతో ఈ వీడియోను షూట్ చేసినట్లు ఫిలింనగర్లో టాక్ సాగుతోంది. మరో వైపు.. ఈ చిత్రం నరేశ్, పవిత్రల బయోపిక్ అని కూడా ఫిలింనగర్లో చర్చ నడుస్తోంది. వీరిద్దరిపై ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ఓ రియల్ స్టోరీతో....రీల్ స్టోరిగా తెరకెక్కించాలని చూస్తున్నారనే టాక్ సైతం హల్ చల్ చేస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు.. ఈ జంట సహజీవనంలో ఉందో లేదో.. అలాగే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో ఎవరికీ తెలియదని.. కానీ ప్రస్తుతం ఈ జంట వెండి తెరపై నటిస్తోందని.. దానిని తెలివిగా క్యాష్ చేసుకోవడం కోసం.. ఈ వీడియోని రిలీజ్ చేశారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-naresh-pavitra-lokesh-lip-lock-video-a-publicity-stunt-39-149624.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.