జాతీయ రహదార్లకు లగచర్ల అడ్డంకి  అయ్యిందా?

Publish Date:Nov 29, 2024

Advertisement

లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్ కోసం తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయసేకరణ వివాదాస్పదం కావడంతో జాతీయ రహదారుల కోసం  భూసేకరణ సరిగ్గా జరగడం లేదని  తెలుస్తోంది. అవార్డ్ పాస్ అయిన భూములకు ఇంత వరకు నష్ట పరిహారం అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అడ్వాన్స్ ఇవ్వకుండానే భూసేకరణ చేపడుతున్న అధికారులకు  రైతులు సహకరించడం లేదు. దీంతో రేవంత్ సర్కార్ కు విషయం అర్థమైంది.  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన లగచర్లను సాకుగా చేసుకుని రైతులు భూసేకరణకు ముందుకు రావడం లేదు. దీంతో లగచర్ల భూసేకరణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. రైతుల నుంచి అడుగడుగునా వ్యతిరేకత రావడంతో రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది. భూసేకరణ చేసే జాతీయ  రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ ఏ ఐ) ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో రైతులు భూసేకరణకు సహకరించకపోతే జాతీయ ప్రాధికార సంస్థ  కు ఎలా సహకరిస్తారని  రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డికి సూటిగా ప్రాధికార సంస్థ  ప్రశ్నించింది. రైతులకు అడ్వాన్స్ ఇవ్వకుండా భూములు ఇవ్వరని కోమటిరెడ్డి తేల్చేసి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 
రీజినల్ రింగ్ రోడ్డుకోసం ఇప్పటికే 95 శాతం భూములను  ప్రాధికార సంస్థ సేకరించింది. మిగతా ఐదు శాతం భూములను సేకరించిన తర్వాతే అవార్డ్ పాస్ అయిన భూములకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రాధికారసంస్థ నిర్ణయించినట్టు కనబడుతోంది. శుక్రవారం లగచర్ల భూసేకరణ నిలుపుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి ఇదే కారణమని తెలుస్తోంది
 

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.