జగన్ జాతకం తిరగబడిందా?

Publish Date:Apr 17, 2023

Advertisement

వైనాట్ 175 అంటూ రంకెలేసిన వైసీపీ సేన ప్రస్తుతం ఆత్మ పరిశీలనలో పడింది. నేనున్నాను.. నేను విన్నాను నుండి మా నమ్మకం నీవే జగన్ అనేంత వరకూ సాగిన జగన్సాలన ఏమీ సాధించకుండానే చరమాంకానికి చేరుకుంది. డజను సీబీఐ కేసులు, 16 నెలల జైలు జీవితం పెట్టుబడిగా సాధించుకున్నసీఎం పదవి  జగన్ కు కష్టాలనే మిగిల్చింది. నోరు జారిన పాపానికి నవరత్నాలను మేనిఫెస్టోలో పెట్టి, గెలిచిన తరువాత అమలుకు అష్టకష్టాలూ పడుతున్నాడని రాజకీయ పండితులు అంటున్నారు.

దీంతో రాష్ట్రం  దివాళా తీసే పరిస్థితి రావడం,  అప్పుల కోసం అన్ని అడ్డ దారులూ తొక్కడం జగన్ పదవీ కాలంలో ఆయనకు గుర్తుండిపోయే కొన్ని విషయాలు. డబ్బులు పంచడమే సంస్కరణ అన్న కొత్త సంస్కరణ అమలు చేయడం ఎంత కష్టమో జగన్ కు అర్ధం అయ్యింది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటా 97 వూల రెటకలే. ఇది62 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వాటా. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఐదేళ్లూ పరిపాలన  సాగించిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా లక్షా డెబ్భై వేల కోట్లు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గడిచిన  నాలుగేళ్లలో చేసిన అప్పు అక్షరాలా రెండు లక్షల ముఫై వేల కోట్లు. అన్నీ చేర్చుకుని ఈ రోజుకు ఏపీ అప్పు నాలుగు లక్షల ఎనభై మూడు వేల కోట్లుగా కేంద్రం నిర్ధారించింది.

అయితే తెలుగుదేశం హయాంలో ఐదేళ్ల అప్పుకంటే జగన్ నాలుగేళ్ల అప్పు యాభై వేల కోట్లు అధికం.  మరో సంవత్సరం మిగిలి ఉన్నందున మరో 70 వేల కోట్ల అప్పుకు జగన్ పథకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో జగన్ కు తప్పనిసరి అనేది ఆర్థిక విశ్లేషకుల వాదన. 
జగన్ ప్రభుత్వం స్విచ్ నొక్కిపంచిన డబ్బులే ఓట్లుగా మారి ఈవీఎమ్ చిప్ లను ఫ్యాన్ గుర్తుతో నింపేస్తాయని వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అలా అయితే 2024 ఎన్నికలలో అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది కొంత మంది సిట్టింగ్ లు, ఆశావహుల లాజిక్.

ఒక వేళ వైసీపీ అభ్యర్థులు అలా ఆలోచించి ఎన్నికలలో ఖాళీ జేబులతో తిరిగితే పార్టీ అధికారంలోకి రావడం సంగతి  తరువాత, పరువు కూడా దక్కదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పులి మీద పుట్రలా  వివేకా హత్య కేసు, పార్టీలో అసమ్మతి, మరో వైపు రోజు రోజుకీ పెరుగుతున్న తెలుగుదేశం గ్రాఫ్ వైసీపీ అధిష్ఠానానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి.  ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. చర్చించుకుంటున్నారు. తాజాగా జగన్ జాతకాలు చెప్పే వారిని స్పెషల్ ఫ్లైట్లలో రప్పించుకుని చర్చించడం ఆ పార్టీలో అంతర్మథనాన్ని చెప్పకనే చెబుతోంది.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.