సంకటాల్లో వెంకటరెడ్డి.. నేడో రేపో సస్పెన్షన్ వేటు?

Publish Date:Aug 1, 2024

Advertisement

జగన్ హయాంలో  నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తో అంటకాగి నిబంధనలకు తిలోదకాలిచ్చినట్లుగా భావించిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా హోల్డ్ లో ఉంచింది. అలా ఉంచిన వారిలో ఒకరైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.  అంటే జగన్ హయాంలో తాను నిబంధనలకు తిలోదకాలిచ్చి తప్పిదాలకు పాల్పడినట్లు పరోక్షంగా అంగీకరించేశారు. 

మునిసిపల్ ఎడ్మినిస్ట్రేటన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి,  రెవెన్యూ (ఎక్సైజ్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవలకు కూడా చంద్రబాబు సర్కార్ ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా జీఏడీలో  రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.  ఇంకా పలువురు అధికారులకు కూడా చంద్రబాబు సర్కార్ ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టింది. అలాంటి వారిలో ఒకరైన జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి వెంకటరెడ్డి ఒకరు.   వెంకటరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.   జగన్ హయాంలో  ఎపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన భారీ స్థాయిలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే  మైన్స్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో వెంకటరెడ్డి అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు రుజువవ్వడంతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సిఫారసు చేశారు. ఈ మేరకు వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తూ నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  కోస్ట్ గార్డ్స్ లో పని చేస్తున్న వెంకటరెడ్డిని జగన్ సర్కార్  కావాలని రాష్ట్రానికి డెప్యూటేషన్ పై పిలిపించుకుని ఎపీ ఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలకు కట్టబెట్టింది.  అదలా ఉంచితే తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన తరువాత ఏపీఎండీసీని సీజ్ చేసి, ప్రభుత్వ రికార్డులు ఏవీ బయటకు తరలి పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.  మైన్స్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు జగన్ సర్కా ర్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కూలంకషంగా పరిశీలించి ఒక నివేదిక రూపొందించి చంద్రబాబుకు అందజేశారు. ఆ నివేదిక మేరకే వెంకటరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయనుంది. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.