కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి.. ఒక ఇండియన్ మృతి

Publish Date:Jun 3, 2026

Advertisement

గల్ఫ్ లో యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లాయి.   ఎప్పుడేం జరుగుతుందో తెలియని నిప్పుల కొలిమిలా మిడిల్ ఈస్ట్  మారిపోయింది. తాజాగా  కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడి గల్ఫ్ రీజియన్‌లో  కలకలం రేపింది. ఈ భీకర దాడిలో ఒక  ఇండియన్ సిటిజన్ మరణించాడు.   నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే కువైట్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 లక్ష్యంగా ఇరాన్ ఈ దాడికి  తెగబడింది. క్షిపణులు దూసుకువచ్చి పేలడంతో ఆ ప్రాంతమంతా భారీ శబ్దాలతో, దట్టమైన పొగలతో రణరంగంగా మారిపోయింది.

ఈ ఘోర ప్రమాదంలో   ఒక్కరు మరణించడమే కాకుండా,   63 మంది ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను గమనించిన కువైట్ అత్యవసర విభాగాలు తక్షణమే స్పందించాయి. సంఘటనా స్థలానికి   అంబులెన్సులు హుటాహుటిన చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. బాధితులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.  

ఈ దాడిలో ఇండియన్ సిజిజన్  మరణించిన విషయాన్ని కువైట్‌లోని భారత  ఎంబసీ  అధికారికంగా  ధృవీకరించింది.  ఆ భారతీయుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని  ప్రకటించింది. మృతుడి పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కువైట్ ఉన్నతాధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. తమ దేశంలోని అత్యంత కీలకమైన పౌర సదుపాయాలపై జరిగిన ఈ క్షిపణి దాడిని కువైట్ విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో ఖండించింది. కాగా ఈ దాడితో   ప్రయాణికుల భద్రతను దృష్ట్యా కువైట్ ప్రభుత్వం జూన్ 4 వరకు విమాన రాకపోకలన్నింటినీ   రద్దు చేసింది.  

By
en-us Political News

  
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.