నాన్నా పులి కథలా ఇరాన్, అమెరికా శాంతి చర్చలు!

Publish Date:Jun 29, 2026

Advertisement

అమెరికా ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా  ఇరు దేశాల మధ్య  దాడులు, ఉద్రిక్తతలు సడలడం లేదు.  పదే పదే శాంతి ఒప్పంద ప్రకటనలు, కాల్పుల విరమణ ఒప్పందాలతో ఇరాన్, అమెరికాల మధ్య శాంతి ఒప్పందం వార్తలపై ప్రపంచం నమ్మకం సడలిపోతోంది. ఈ వ్యవహారం అంతా నాన్నా పులి కథలా ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా.. ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.

నిఘా వ్యవస్థలు, సమాచార మార్పిడి నెట్‌వర్కులు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్‌ల నిల్వ స్థావరాలు, సముద్రంలో గనులు పరవడం వంటి సామర్థ్యాలపై అమెరికా దాడులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇరాన్‌ మళ్లీ దాడులకు దిగిందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు  హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్‌ పదేపదే ఉల్లంఘిస్తోందని విమర్శలు గుప్పించిన ఆయన, ఇదే పరిస్థితి కొనసాగితే.. పూర్తి స్థాయి యుద్ధం ద్వారా ఇరాన్‌ చాప్టర్ ను క్లోజ్ చేస్తామని హెచ్చరించారు.   ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఖ్చీ హర్ముజ్‌ జలసంధిపై తమ పూర్తి నియంత్రణ ఉందని పునరుద్ఘాటంచారు.  నియమాలు ఉల్లంఘించే నౌకలు సమస్యలకు కారణమవుతాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అదే సమయంలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ నేవీ కమాండర్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే  సమస్యలను ఎదుర్కొంటాయని హెచ్చరించారు.

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కువైట్‌లోని అలీ అల్‌ సలేం ఎయిర్‌ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. కువైట్‌ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపింది. గల్ఫ్‌ దేశాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

తీవ్ర సైనిక ఉద్రికతల మధ్య కూడా శాంతి చర్చల యత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో జరిగిన అవగాహన ఒప్పందం తర్వాత 60 రోజుల వ్యవధిలోనే దాడులు మళ్లీ మొదలవడంతో చర్చలు నిలిచిపోయాయి. అయితే ఖతార్, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు మళ్లీ చర్చలకు సిద్ధమయ్యారు. ఈ వారంలోనే దోహాలో హర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ చర్చలు ఫలితాలిస్తే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉంది.

By
en-us Political News

  
యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది.
సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు
ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే, నివేదికల ప్రక్రియ ముజీబుర్ రహ్మాన్ జీవితంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేదనే విషయం అతనికి తెలిసింది. తన పేరు నమోదు కాకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే ఎటువంటి సహాయం లేదా పెన్షన్లు, రేషన్ వంటి ప్రయోజనాలు తన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలకు అందవేమోనని అతనుఆందోళనకుగురయ్యాడు.
ఆయన ఐదు రోజుల్లో నాలుగు రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పేదల సేవలో కార్యక్రమం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు లబ్థిదారులకు అంద జేస్తారు. అదే రోజు తిరుపతి చేరుకుని అక్కడి శ్రీసిటీలో.. హీరో మోటో కార్ప్ సుమా . 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి శ్రీసిటీలోనే బస చేస్తారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ అత్యంత దారుణ హత్యకు గురైన ఉదంతం
ఎల్ నినో కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలనీ, ప్రకృతి సాగుతో పంటలు పండించి, భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని ఆయన పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.