Publish Date:May 20, 2022
భారత్ లో క్రికెట్ ఒక మతం.. క్రికెటర్లను అభిమానులు దేవుళ్లతో సమానంగా కొలుస్తారనడానికి క్రికెట్ దేవుడంటూ సచిన్ కు ఒక ట్యాగ్ తగిలించేయడమే నిదర్శనం. అలాంటి క్రికెట్ ఇప్పుడు అమెరికాలోనూ అడుగిడుతోంది. క్రికెట్ ఫీవర్ తో అమెరికన్లు ఊగిపోయే రోజు మరెంతో దూరంలో లేదు. అమెరికాలో కూడా ఐపీఎల్ తరహాలో టి20 క్రికెట్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఇందుకు మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ సత్య నాదెళ్ల ముందుకు వచ్చారు.
ఆయన ప్రధాన ఇన్వెస్టర్ గా, పలు దిగ్గజ కంపెనీల యజమానులు, సీఈవోలు ముందుకు వచ్చి క్రికెట్ ఫీవర్ ను ఎలాగైన అమెరికకు అంటించాలని కంకణం కట్టుకున్నారు.అమెరికాలో ప్రపంచ స్థాయి టీ20 క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం కోసం ఏ అండ్ ఏ1 ఫండ్ రైజింగ్ పేరుతో నిధుల సమీకరణ చేపట్టారు. సల్వ వ్యవధిలోనే 44మిలియన్ డాలర్లను సమీకరించారు. మరో ఏడాదిలోగా దీనిని 76మిలియన్ డాలర్లకు చేర్చాలన్నది లక్ష్యం. మొత్తం 120మిలియన్ డాలర్లను ఫండ్‌ను సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కు సత్యా నాదెళ్ల లీడింగ్ రోల్ పోషిస్తున్నారు.
పెట్టుబడిదారుల్లో సత్య నాదెళ్లతో పాటుగా శంతను నాయణ్, మాడ్రోనా వెంచర్ గ్రూప్ ఎండీ సోమ సేగర్, మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్‌షిప్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రాజారమణ్, వెంకీ హరినారాయణ్, ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ ఛైర్మన్ జైతర్ సంజయ్ గోవిల్, మేనేజింగ్ పార్టన్ పెరోట్ జైన్ తదితరులు ఉన్నారు. ప్రపంచ స్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహణతో పాటు అమెరికాలో క్రికెట్ మార్కెటింగ్ నూ పెంచడం లక్ష్యమని సత్యానాదెళ్ల తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ipl-like-cricket-tournment-in-america-25-136211.html
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.