బెంగళూరా? పంజాబా?.. నేడే ఐపీఎల్ ఫైనల్

Publish Date:Jun 3, 2025

Advertisement

కోహ్లీకి 18 సెంటిమెంట్ కలిసి వస్తుందా?

క్రికెట్ అభిమానుల్లో.. ఐపీఎల్ పైనల్ ఉత్కంఠ పెంచుతోంది. ఈసారి కప్ కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా.. పంజాబ్ కింగ్సా? అనేది మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.  ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు అవుతున్నా.. ఈ రెండు టీమ్‌లూ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి.. ఏ టీమ్ గెలిచినా.. కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే.. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పంజాబ్ కింగ్స్‌ని చిత్తుగా ఓడించి నేరుగా ఫైనల్ చేరుకుంది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్.. ముంబై ఇండియన్స్‌పై అద్భుతమైన విజయం సాధించి.. ఫైనల్ చేరింది. రెండూ టీమ్‌లూ.. ఫైనల్ చేరుకునేందుకు సూపర్బ్ గా ఆడుతూ వచ్చాయ్.  అయితే.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్‌ని భారీ తేడాతో ఓడించింది. ఇది.. రాయల్స్‌కి కొంతవరకు అప్పర్ హ్యాండ్ తమదేననే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ.. ఐపీఎల్ ఫైనల్‌లో ఏదైనా జరగొచ్చు. టీ20 క్రికెట్‌లో.. మ్యాచ్‌ని టర్న్ చేసే మూమెంట్స్ చాలా ఉంటాయ్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఆఖరి బంతి వరకు.. ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. దాంతో.. ఈసారి కప్పు కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా? లేక.. పంజాబ్ కింగ్సా? అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఫీవర్ పెంచేస్తోంది.

అయితే.. ఐపీఎల్‌‌లో ఇది 18వ సీజన్. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. ఆర్సీబీ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్న ఈ 18 సెంటిమెంట్.. బెంగళూరుని టైటిల్ విన్నర్‌గా నిలుపుతుందా?  లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు.. ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని.. ఆర్సీబీ కల ఈసారి నెరవేరుతుందా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. లీగ్‌ దశలో పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ పొజిషన్ సెంటిమెంట్ కూడా.. ఆర్సీబీకి పాజిటివ్ వైబ్ ఇస్తోంది.  ఇప్పటి వరకూ జరిగిన  ఐపీఎల్ హిస్టరీని పరిశీలిస్తే.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టు.. ఏకంగా 8 సార్లు టైటిల్‌ని గెలుచుకుంది. ఈ సెంటిమెంట్ ప్రకారం.. ఆర్సీబీకి కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పోర్ట్స్ అనలిస్టులు భావిస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కూడా.. ఆర్సీబీకి ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, లివింగ్ స్టన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉండటం.. ఆర్సీబీకి పెద్ద బలమనే చెప్పాలి.  వీరికి.. ఎలాంటి టైమ్‌లోనైనా మ్యాచ్‌ని టర్న్ చేసే సత్తా ఉంది.  ఇక.. బ్యాలెన్స్‌డ్ బౌలింగ్ కూడా ఆర్సీబీకి కలిసొస్తోంది. యశ్ దయాల్,  జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ లాంటి పేసర్లు, సుయాష్ శర్మ లాంటి స్పిన్నర్లతో.. ఆర్సీబీ ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తోంది. ఇక వరుస విజయాలు, అద్భుతమైన ప్రదర్శన.. ఆర్సీబీలో కాన్ఫిడెన్స్‌ని పెంచాయి. ఇప్పుడు.. ఫైనల్స్ ఆడేందుకు కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఆర్సీబీ ప్లేయర్లలో ఉంది.

పంజాబ్ కింగ్స్ కూడా క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పటికీ.. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ని ఓడించి ఫైనల్ చేరుకోవడం.. ఆ టీమ్‌లో కాన్ఫిడెన్స్‌  పెంచింది.  భారీ టార్గెట్లను ఛేదించే సామర్థ్యం.. పంజాబ్ కింగ్స్‌కు ఉంది. ఈ సీజన్‌లో అనేక సార్లు 200 పైగా పరుగులు చేసింది  ఈ టీమ్. దాంతో.. ఫైనల్‌లో ఎంత పెద్ద టార్గెట్‌నైనా ఛేదించగలమనే నమ్మకంతో ఉన్నారు పంజాబ్ ఫ్యాన్స్. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కూడా ఆ జట్టుకు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. అతను.. టీమ్‌ని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. జానీ బెయిర్ స్టో, జోష్ ఇంగ్లిష్ లాంటి పవర్ హిట్టర్లు, శ్రేయస్ అయ్యర్, నెహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్ లాంటి బలమైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. కీలక సమయాల్లో వేగంగా పరుగులు చేసే సామర్థ్యం వీళ్లకు ఉంది.  ఆల్‌రౌండర్లు.. టీమ్‌కు ఉన్న మరో బలం. అర్ష్‌దీప్ సింగ్, చాహల్, హర్‌ప్రీత్ బార్ లాంటి బౌలర్లు.. కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్నవారు. పేస్, స్పిన్ కలయికతో.. పంజాబ్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లని ఇబ్బంది పెట్టగలరు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో భారీ ఓటమిని చవిచూసినా.. ముంబై ఇండియన్స్‌ లాంటి బలమైన టీమ్‌ని ఓడించి.. ఫైనల్ చేరడం పంజాబ్ కింగ్స్‌లో కాన్ఫిడెన్స్ పెంచింది. మొత్తంగా.. అటు ఆర్సీబీ, ఇటు పంజాబ్ కింగ్స్.. ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలనే  పట్టుదలతో ఉన్నాయ్. అయితే ఫైనల్‌లో ఏ టీమ్ మెరుగైన ప్రదర్శన చేస్తుంది.. ఎవరు ఒత్తిడిని ఎదుర్కొంటారనే దాని మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ ఫైనల్ చేరిన ఆర్సీబీ.. అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పుంజుకున్న పంజాబ్ కింగ్స్.. ఫైనల్‌లో ఉన్నాయ్ కాబట్టి.. ఇదొక.. ఉత్కంఠభరితమైన ఫైనల్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

By
en-us Political News

  
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో డీఐజీ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
పవన్ కళ్యాణ్‌ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి.
ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్‌ రోకోకు ఆమె పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతన‌మ‌య్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ ప‌డిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్ర‌పంచంలో ఉన్న ఎన్నో వివాదాలను ప‌రిష్కరించారు. ఆయ‌న‌కా క్రెడిట్ ద‌క్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మ‌స్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్ద‌రూ ఇపుడు కలిసిపోయారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.