విశాఖలో 50 దేశాలు...70 యుద్ద నౌకలు

Publish Date:Feb 15, 2026

Advertisement

 

విశాఖ సాగరతీరం విభిన్న నౌకలతో అలలారుతుంది. కొత్త కాంతులను వెదజల్లుతుంది. ఒకటి కాదు,రెండు కాదు... 70కి పైగా యుద్ధ నౌకలు,  ధవళ వస్త్రాలతో నేవీ సిబ్బంది చేసే విన్యాసాలతొ పది రోజుల పాటు సాగరతీరంలో ఆదివారం (15-2-26) నుంచి పది రోజుల పాటు సందడి నెలకొననుంది. భారత నౌకాదళం అరుదుగా నిర్వహించే ‘అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష’ (ఐఎఫ్‌ఆర్‌)కు విశాఖపట్నం మరోసారి వేదికగా మారింది. 

దేశంలో ఇప్పటిదాకా రెండుసార్లు ‘ఐఎఫ్‌ఆర్‌’ నిర్వహించగా మొదట ముంబైలో (2001), పదేళ్ల క్రితం విశాఖలో (2016) జరిగింది. దశాబ్దం తరువాత తిరిగి (2026) విశాఖనే ఎంపిక చేయడం విశేషం. ఈ ఉత్సవానికి 50 దేశాల నుంచి నాలుగు వేల మంది అతిథులు, 70కి పైగా యుద్ధనౌకలు వస్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్లకొకసారి భారత నౌకాదళం నిర్వహించే ‘మల్టీ లేటరల్‌ నేవల్‌ ఎక్సర్‌సైజెస్‌ (మిలాన్‌)’ కూడా ఈసారి విశాఖలోనే నిర్వహిస్తున్నారు. 

ఇందులో భారతదేశంతో స్నేహసంబంధాలు కలిగిన దేశాలన్నీ పాల్గొంటాయి. ఈ రెండింటితో సరిపెట్టకుండా ముచ్చటగా మూడో కార్యక్రమం ‘ఇండియన్‌ ఓషన్‌ నేవల్‌ సింపోజియం’ అదనపు ఆకర్షణ. హిందూ మహా సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలన్నీ ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ నేటి (ఫిబ్రవరి 15) నుంచి మొదలై 25వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పది రోజులు విశాఖ ధవళ వస్త్రధారులతో ధగధగా మెరిసిపోనుంది.

By
en-us Political News

  
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన రాజకీయ హింస రోజురోజుకూ ముదురుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.