సమయస్ఫూర్తి

Publish Date:Oct 17, 2020

Advertisement

 

ఇది అన‌గా అన‌గానాటి మాట. అప్పట్లో ఓ మారుమూల గ్రామంలో... పార్వత‌మ్మ అనే ముస‌ల‌మ్మ ఉండేది.  ఆమెకి పాపం రానురానూ క‌ళ్లు మ‌స‌క‌బారిపోయాయి. ఓ రోజు త‌న గ్రామంలోకి ఒక వైద్యుడు వ‌చ్చాడ‌నీ, ఆయ‌న హ‌స్తవాసి చాలా మంచిద‌నీ పార్వత‌మ్మ విన్నది. ఆ వైద్యుడి వ‌ల్ల త‌న క‌ళ్లు బాగుప‌డి తిరిగి ఈ అంద‌మైన లోకాన్ని చూసే భాగ్యం క‌లిగితే బాగుండు అనుకుంది. అనుకున్నదే త‌డువుగా, త‌న‌ పక్కింటి కుర్రవాడిని బ‌తిమాలుకుని, అత‌ని చేయిప‌ట్టుకుని ఆ వైద్యుని వద్దకు చేరుకుంది.

 

‘బాబూ నాకు నా ఇంటినీ, ఆ ఇంటి చుట్టూ ఉండే తోట‌నీ, ఆ తోట‌లో పూల‌నీ, వాటిపై వాలే సీతాకోక‌చిలుక‌ల్నీ... తిరిగి ఈ క‌ళ్లతో చూడాల‌ని ఆశ‌. అందుకోసం నా ద‌గ్గర దాచుకున్న డ‌బ్బంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాగైనా నా చూపును తిరిగి ర‌ప్పించు,’ అని బ‌తిమాలింది.

 

వైద్యుడు నిజంగా మంచి హ‌స్తవాసి క‌లిగిన‌వాడే. కానీ దాచుకున్న డ‌బ్బునంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని పార్వత‌మ్మ అనేస‌రికి అత‌నిలో అత్యాశ మొద‌లైంది. ‘స‌రే మామ్మగారూ! నేను చేయ‌గ‌లిగిన‌దంతా చేస్తాను. కాక‌పోతే అందుకోసం ఖ‌రీదైన మందుల్ని వాడాల్సి ఉంటుంది. మీకు క‌నుక తిరిగి చూపు వ‌స్తే నాకు ప‌దివేల వ‌ర‌హాలు ఇవ్వాలి మ‌రి,’ అన్నాడు వైద్యుడు.

 

ప‌దివేల వ‌ర‌హాలంటే మాట‌లా! ముస‌ల‌మ్మ తన జీవితాంతం క‌డుపుకాల్చుకుని కూడ‌పెట్టుకున్నదంతా క‌లిపితే అంత అవుతుంది. అయినా ముస‌ల‌మ్మ త‌న చూపు కోసం అంత డ‌బ్బునీ ఇవ్వడానికి సిద్ధప‌డింది. కానీ వైద్యుని అత్యాశ‌ని గ‌మ‌నించి ముందుజాగ్రత్తగా ఒక ష‌ర‌తుని విధించింది. `నువ్వు ఇవ్వమ‌న్న డ‌బ్బుని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నా చూపు తిరిగి బాగుప‌డితేనే సుమా!’ అంది పార్వత‌మ్మ. దానికి వైద్యుడు స‌రేన‌న్నాడు.

 

ఆనాటి నుంచీ ప్రతిరోజూ ఉద‌యాన్నే వైద్యుడు ఠంచ‌నుగా పార్వత‌మ్మ ఇంటికి చేరుకునేవాడు. తాను త‌యారుచేసిన‌, లేపనాల‌నీ, లేహ్యాల‌నీ, భస్మాల‌నీ ఆమెకు అందిచేవాడు. అయితే వైద్యుడికి ఆశ ఎక్కువ క‌దా! ముస‌ల‌మ్మ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా, ఆ ఇంట్లో ఉండే ఇత్తడీ, రాగి సామాన్లని చూసి అత‌నికి ఆశ పుట్టేది.

 

‘ఈ ముస‌ల‌మ్మకి ఎలాగూ క‌నిపించ‌దు! వీటిలో కొన్నింటిని తీసుకుంటే ఏం పోయింది. ఒక‌వేళ ఆవిడ‌కి చూపు రాక‌పోతే, ఇన్నాళ్లూ నేను చేసిన వైద్యానికి ఖ‌ర్చులుగా అన్నా ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి’ అన్న ఆలోచ‌న అత‌నిలో మొద‌లైంది. ‘ఒక‌వేళ ఆవిడ‌కి చూపు తిరిగి వ‌చ్చినా ఎప్పుడో ఇంటి మారుమూల ఉంచుకున్న వ‌స్తువుల ఏం గుర్తుంటాయి’ అనుకున్నాడు. దురాశ మొద‌లైందే త‌డువు, పార్వత‌మ్మ వైద్యం కోసం వ‌చ్చే ప్రతిసారీ.... అందుబాటులో ఉన్న చిన్నాచిత‌కా సామానుని త‌న సంచీలో కుక్కుకుని బ‌య‌ల్దేరేవాడు.

 

పార్వత‌మ్మ న‌మ్మకం చేత‌నో, లేకి నిజంగానే వైద్యుని హ‌స్తవాసి ఫ‌లించ‌డం చేత‌నో.... ఆరు మాసాలు తిరిగేస‌రిక‌ల్లా ఆమెకు స్పష్టంగా చూపు తిరిగి వ‌చ్చేసింది. కానీ పార్వత‌మ్మ సామ‌న్యురాలా! త‌న ఇంట్లో చాలా వ‌స్తువులు మాయ‌మవ్వడం ఆమె గ్రహించింది.

 

పార్వత‌మ్మకు చూపురాగానే, చేసుకున్న ఒప్పందం ప్రకారం... త‌న‌కి ఇవ్వవ‌ల‌సి ప‌దివేల వ‌ర‌హాల‌ను ఇవ్వమ‌ని వైద్యుడు అడిగాడు. దానికి పార్మత‌మ్మ స‌సేమీరా అంది. విష‌యం గ్రామాధికారి వ‌ర‌కూ చేరింది.

 

``ఏవ‌మ్మా! పెద్దదానివై ఉండీ ఇలా మాట త‌ప్పడం నీకు గౌర‌వ‌మేనా. చూపు తిరిగి వ‌స్తే ప‌దివేల వ‌ర‌హాలు చెల్లిస్తాన్న ష‌ర‌తుకి ఒప్పుకున్నావా లేదా?’’ అని నిల‌దీశాడు గ్రామాధికారి.
``ఆ ష‌రతుకి నేను లోబ‌డి ఉన్న మాట నిజ‌మేన‌య్యా! కానీ ఈయ‌న వైద్యంలో ఏదో లోపం జ‌రిగింది. లేకపోతే, ఆయ‌న మా ఇంటికి రాక ముందు ఉండాల్సిన సామానుల‌న్నీ, ఇప్పుడు నాకు క‌నిపించ‌కుండా పోవ‌డ‌మేంటి? అందుక‌నే ఆ మొత్తాన్నీ నేను చెల్లించ‌లేదు’’ అని బ‌దులిచ్చింది పార్వత‌మ్మ.

 

పార్వత‌మ్మ మాట‌ల‌కు గ‌తుక్కుమ‌న్నాడు వైద్యుడు. అక్కడికి చేరుకున్నవారంద‌రికీ కూడా పార్వత‌మ్మ మాట‌ల్లోని ఆంత‌ర్యం బోధ‌ప‌డి, ముసిముసిన‌వ్వులు న‌వ్వుకుంటూ ఎవ‌రి ఇళ్లకు వారు బ‌య‌ల్దేరారు.

 

చేసిన దొంగ‌త‌నం అలా బ‌య‌ట‌ప‌డిపోవ‌డంతో, గ్రామాధికారి ద‌గ్గర చీవాట్లు తిని, ఇక నుంచి బుద్ధిగా మ‌సులుకుంటాన‌ని మాట ఇచ్చి, వ‌డివ‌డిగా త‌న ఇంటికి వెళ్లిపోయాడు వైద్యుడు.

 

అలా ముస‌లామె, వైద్యుడి అత్యాశ‌ని తీర్చేందుకు ప‌దివేల వ‌ర‌హాల రుసుముని త‌ప్పించుకోవ‌డ‌మే కాదు. అత‌ని దొంగబుద్ధి గురించి గ్రామం మొత్తానికీ తెలియ‌చేసిన‌ట్లయింది.  దాంతో పాటుగా త‌న అంద‌మైన తోట‌ని తిరిగి చూడాల‌న్న కోరికా నెర‌వేరింది.
 

(ఏసోప్‌ కథల ఆధారంగా)

 

-నిర్జర

By
en-us Political News

  
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.