Publish Date:Jul 31, 2024
పారిస్ ఒలింపిక్స్ లో భారత షట్లర్లు సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో పతకాల దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పురుషుల డబుల్స్ విభాగంలో రంకిరెడ్డి సాత్విక్, చిరాగ్ జోడీ క్వార్టర్స్ కు చేరుకోగా, తెలుగు తేజం, ఇండియన్ ఏస్ షట్లర్ పీవీ సింధూ మహిళల సింగిల్స్ లో వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్ కు చేరింది.
గ్రూపులో తొలి మ్యాచ్ లో మాల్దీవులపై సునాయాస విజయం సాధించిన సింధు బుధవారం (జులై 31) న ఎస్తోనియాకు చెందిన కుబా క్రిస్టిన్ పై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో కుబా క్రిస్టిన్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-5, 21-10 తేడాతో విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సింధు.. ఈసారి పసిడి పతకంపై గురిపెట్టింది. ఆ లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తున్నది.
అలాగే పురుషుల సింగిల్స్ లో ఇండియన్ షట్లర్ లక్ష్యసేన్ కూడా వరుసగా మూడు విజయాలతో క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు బుధవారం (జులై 31) జరిగిన మ్యాచ్లో ఇండోనేషియా క్రీడాకారుడు జోనాటన్ క్రిస్టీపై లక్ష్యసేన్ 21-18, 21-12 తేడాతో వరుస విజయాలు సాధించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indian-shutlers--raising-hopes-on-medals-in-paris-olympics-25-181909.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.