Publish Date:Feb 10, 2026
ఆడే వాళ్లకు తప్ప పెద్దగా ఆ పేరు పరిచయం ఉండదు. అసలు మన దేశంలో ఆ క్రీడకు ప్రాచుర్యమే లేదు. అదే లాక్రోస్ గేమ్. తాజాగా ఆసియా లాక్రోస్ గేమ్స్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు అదరగొట్టడంతో ఈ క్రీడ వైరల్ అవుతోంది. సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు విజేతలుగా నిలిచి డబుల్ గోల్డ్ సాధించాయి. ఒలింపిక్ క్రీడ అయిన ఈ లాక్రోస్ ఈవెంట్ పురుషుల ఫైనల్లో భారత్ 9-2తో ఇరాక్‌ను ఓడించగా, మహిళల బృందం 22-5తో పాకిస్థాన్‌పై గెలిచింది.
ట్రోఫీ నెగ్గిన భారత పురుషుల జట్టు కెప్టెన్ అనుదీప్ రెడ్డి తెలంగాణకు చెందిన క్రీడాకారుడు కావడం విశేషం. అనుదీప్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా వేముల గ్రామం. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన హుస్సేన్‌సాబ్ కూడా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. హాకీ, సాకర్, బాస్కెట్‌బాల్‌ల సమ్మేళనమే లాక్రోస్ క్రీడ. ఒక్కో జట్టులో పదిమంది ఉంటారు. హెల్మెట్, గ్లోవ్స్, ప్యాడ్స్ ధరించి నెట్‌తో కూడిన పొడవాటి స్టిక్‌తో రబ్బరు బంతిని ప్రత్యర్థి గోల్‌లోకి పంపడమే ఈ ఆట. పురుషులు, మహిళలు ఆడే ఈ క్రీడను మొదటగా 1904, 1908 ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2028లో జరిగే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఈ ఆటను చేర్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-double-gold-in-asia-lakros-games-36-213787.html
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన రాజకీయ హింస రోజురోజుకూ ముదురుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్‌కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.