2-0 సిరీస్ కైవసం చేసుకున్న భారత్
Publish Date:Sep 3, 2012
Advertisement
బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండవ, ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్ట్ ల సిరీస్ ను ధోని సేన 2-0 తేడాతో కైవసం చేసుకుంది. గంభీర్ 34, సెహ్వగ్ 38, పుజారా 48, సచిన్ 27, రైనా పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరగా.. కోహ్లీ 51, ధోని 48 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ జట్టులో పటేల్ 3 వికెట్లు, సౌథీ, బోల్ట్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 248 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ జట్టు ముందు 262 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన భారత కెప్టెన్ గా మహేంద్ర సింగ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 103, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్ భారత విజయలో కీలక పాత్ర పోషించిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరిస్ అవార్డు దక్కింది.
http://www.teluguone.com/news/content/india-beat-new-zealand-by-five-wickets-31-17094.html





