స్కూల్స్ తెరిస్తే.. తిప్పలు తప్పవు..  

Publish Date:Jul 6, 2021

Advertisement

ఓ వంక కరోనా మూడవ వేవ్ ముందుగానే వచ్చేస్తుందని, అనుకున్న విధంగా, నవంబర్ వరకు ఆగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వంక ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా దేశంలో చాలా రాష్రాధంలు లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తేస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు, ఆ దిశగా అడుగులు చేశాయి. షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ ఇతర వ్యాపార కార్యకలాపాలపై దేశ రాజధాని ఢిల్లీ సహా కొన్నిరాష్ట్రాల్లో ఆంక్షలు చాలా వరకు సడలించారు. మరోవంక  కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు  స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలను తెరిచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. అయితే గత ఏడాది అక్టోబర్‌లో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరిచినప్పటికీ, ఆ తరువాత కరోనా వ్యాప్తి కారణంగా తిరిగి మూతపడ్డాయి. అనంతరం సెకెండ్ వేవ్ కారణంగా విద్యాసంస్థలు మరోమారు మూతపడ్డాయి. అయితే ఇప్పుడు స్కూళ్లు తెరిచే విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో విద్యాసంస్థలను 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో, తెలంగాణలో  ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో , ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాల వత్తిడి మేరకు ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విధ్యార్ధులకు రెగ్యులర్ తరగతులు నిర్వహించాలని  ప్రభుత్వం భావించినా విద్యార్ధులు, తల్లితండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలాగే, డిగ్రీ పరీక్షల విషయంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యర్ధులు సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. 

ఆంధ్ర ప్రదేశ్’లో అయితే, పరిస్థితి పూర్తి అగమ్యగోచరంగా వుంది. కోర్టులకు వెళ్ళకుండా ఏ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపలేని స్థితిలో ఉంది. ఇంటర్ పరీక్షల విషయంలో సుప్రీం కోర్టు చీవాట్లు పెడితేనే గానీ, రద్దు చేయలేదు. ఇక స్కూల్స్, కాలేజీల ఓపెనింగ్ విషయంలో ఏం చేస్తుందో చూడవలసి ఉంది.ఇప్పటికైతే ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం  తీసుకోలేదు. 

గుజరాత్’ లో రాష్ట్రమంత్రి వర్గం భేటీలో విద్యాసంస్థలు తెరవడంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఢిల్లీ విషయానికొస్తే మూడంచెల విధానంలో విద్యాసంస్థలను తెరవనున్నారు. మూడవ దశలో విద్యార్థులు నేరుగా పాఠశాలలకు వెళ్లే ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజస్థాన్‌లో స్కూళ్లు తెరిచినప్పటికీ, విద్యార్థులను తరగతులను హాజరయ్యేందుకు ఇంకా అనుమతించడం లేదు. ప్రస్తుతానికి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.మొత్తానికి కరోనా దేశ వ్యాప్తంగా విద్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది . అందుకే, పరిస్థిటి మరింతగా దిగజారి పోకముందే, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను విడుదల చేయాలని నిపుణులు, తల్లి తండ్రులు సూచిస్తున్నారు.ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపధ్యంలో, సెకండ్ వేవ్ విషయంలో చేసిన తప్పులను కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.