ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం

Publish Date:Feb 10, 2026

Advertisement

 

హైదరాబాద్‌ నగరంలో ఆక్రమణదారులపై కొరడా ఝళిపిస్తూ వారి ఆటకు హైడ్రా చెక్‌ పెట్టింది. ప్రజలకు చెందాల్సిన పార్కులు, చెరువులు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే నగరం నలుమూలలా నాలుగు ప్రాంతాల్లో భారీ ఆపరేషన్లు చేపట్టి ఆక్రమణలను తొలగించింది. అనంతరం వెంటనే ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి భూములను రక్షణలోకి తీసుకుంది. ఈ చర్యల ద్వారా దాదాపు రూ.1511 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

రెండు ప్రాంతాల్లో వెయ్యి గజాలకు పైగా ఉన్న పార్కులను రక్షించగా, మరో రెండు ప్రాంతాల్లో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న వేల ఎకరాల చెరువుల భూములను ఆక్రమణల నుంచి విముక్తం చేసింది.
కొండాపూర్ లో చెరువులను కాపాడిన హైడ్రా శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం–మదీనాగూడ రోడ్డుకు సమీపంలోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్న జంగం కుంట చెరువును హైడ్రా ఆక్రమణల నుంచి కాపాడింది. 

దాదాపు రూ.700 కోట్ల విలువైన 4 ఎకరాల చెరువు భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీ నం చేసుకుంది.చెరువును పూర్తిగా పూడ్చివేసి, మట్టితో చప్పటి చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. భూమి జంగం కుంట చెరువేనని నిర్ధారించారు. ఆక్రమణదా రులపై రెవెన్యూ అధికా రులు కేసులు నమోదు చేశారు.హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం చెరువు పరిధి మొత్తం ఫెన్సింగ్ వేసి రక్షణ చర్యలు చేపట్టారు.

అల్వాల్ కొత్త చెరువులో 8 ఎకరాల ఆక్రమణల తొలగింపు

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువులో పెద్ద ఎత్తున జరిగిన ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో దాదాపు 8 ఎకరాల మేర అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది.ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి చెరువును తీవ్రంగా కలుషితం చేస్తున్నారని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 

కార్మికుల కోసం తాత్కాలిక షెడ్డులు వేసి వ్యర్థాలను నేరుగా చెరువులోకి వదులుతు న్నట్లు ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు, చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు అనుమతి లేవని స్పష్టం చేస్తూ షెడ్డులు, టెంటు సామగ్రికి సంబంధించిన నాలుగు షట్టర్లను పూర్తిగా తొలగించారు.

1100 గజాలకు పైగా పార్కులను కాపాడిన హైడ్రా

నగరంలోని పలు కాలనీల్లో ప్రజల కోసం కేటాయించిన పార్కులను హైడ్రా తిరిగి ప్రజలకు అందించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలి పురం సాహేబ్‌నగర్ కలాన్ పరిధిలోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది.సర్వే నంబర్లు 132, 133లో 1982లో ఏర్పాటు చేసిన లేఔట్‌లో పార్కుగా కేటాయించిన స్థలాన్ని లేఔట్ వేసిన వారే ప్లాట్లుగా మార్చి అమ్మేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. 

ఈ స్థలంలో ప్రహరీ, షెడ్డులు నిర్మించగా హైడ్రా విచారణ లో ఇది పార్కు భూమేనని నిర్ధారించింది. ఆక్రమణలను తొలగించి, పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే మల్కాజిగిరి జోన్ మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయ నగర్, రాథాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును కూడా హైడ్రా రక్షించింది. జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన ఈ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ప్రహరీ, రేకుల షెడ్డులను మంగళవారం తొలగించింది.

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: 

హైడ్రాప్రజలకు చెందాల్సిన భూములను కబ్జా చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హైడ్రా అధికారులు స్పష్టం చేస్తున్నారు. పార్కులు, చెరువులు, ప్రభుత్వ స్థలాలపై అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నగరమంతటా ఆక్రమణలపై దాడులు కొనసాగుతాయని ప్రకటించారు.
 

By
en-us Political News

  
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను రాష్ట్ర విద్యాశాఖ తీవ్రంగా ఖండించింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం పాలసీ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక అడుగు వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న మద్యం రవాణా కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరోసారి అత్యంత భీకరంగా కమ్ముకున్నాయి
సీమవాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి జిల్లాలో అతి త్వరలో ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనుల ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తోంది.
పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలు భారతీయ నావికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.
దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మల్కాజ్‌గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పెను సంచలనంగా మారింది.
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.