హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు..ప్రయాణికులపై పెనుభారం
Publish Date:May 4, 2025
Advertisement
హైదరాబాద్ మెట్రో ఛార్జీలు మే రెండో వారం నుండి పెరిగే ఛాన్స్ ఉంది. కనిష్ట ఛార్జీ రూ. 15 వరకు, గరిష్ట ఛార్జీ రూ. 75 వరకు పెరగవచ్చు. ఎల్ అండ్ టీ ఈ పెంపు ద్వారా ఏడాదికి అదనంగా రూ. 150 కోట్లు ఆర్జించాలని భావిస్తోంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి.. సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఛార్జీల పెంపుదల అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో L&T మెట్రో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎల్ అండ్ టీ ఈ సంస్ధ కోరింది. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసింది. ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో ఉంది మెట్రో సంస్థ. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్‌ను సంస్థ ఎత్తివేసింది. మెట్రో కార్యకలాపాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం.. మాల్స్‌లో అద్దెల ద్వారా సంస్థకు ఏటా సుమారు రూ. 1500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే.. మెట్రో రైలు నిర్వహణ, బ్యాంకు రుణాలపై చెల్లించే వడ్డీలు.. ఇతరత్రా ఖర్చులు అన్నీ కలిపి సంవత్సరానికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు వ్యయం అవుతోందని L&T అధికారులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/hyderabad-39-197428.html





