మినరల్ వాటర్ తో ముంచుకొస్తున్న ప్రమాదం
Publish Date:Mar 12, 2012
Advertisement
హైదరాబాద్: రాష్ట్రంలో మినరల్ వాటర్ పేరుతో మంచినీటి వ్యాపారం చేస్తున్న ప్లాంట్ యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్యాకింగ్ చేసి విక్రయించే నీటికి తప్పనిసరిగా ఐఎస్ ఐ సర్టిఫికెట్ ఉండాలి. కాని ఇటువంటి సర్టిఫికెట్లు లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా వందలాది మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్లాంట్లు అపరిశుభ్రమైన నీటిని విక్రయించి ప్రజల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయి. ఇటీవల ఒక మినరల్ వాటర్ ప్లాంట్ సరఫరా చేసిన వాటర్ క్యాన్ లో చచ్చిన ఎలకపిల్ల కనిపించింది. నిత్యం ఎక్కడో ఒకచోట ఇటువంటి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఐఎస్ ఐ సర్టిఫికెట్లతో కేవలం 300 ప్లాంట్లు మాత్రమే నడుస్తుండగా ఐఎస్ ఐ సర్టిఫికెట్లు, ఐఎస్ ఓ సర్టిఫికెట్లు లేకుండా 5000 వాటర్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వేసవిలో వీటి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ అనధికార ప్లాంట్ల మధ్య పోటీ ఏర్పడి కొన్నిచోట్ల 20 లీటర్ల నీటిని మూడు లేదా నాలుగు రూపాయలకు కూడా విక్రయిస్తున్నారు. ఈ నీటివల్ల అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మినరల్ వాటర్ ప్లాంట్ మంచినీరు లభ్యమయ్యే సొంత బోరును తవ్వించుకోవాలి. ఈ బోరులు తవ్వడానికి ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఈ ప్లాంట్లు తప్పనిసరిగా ఐఎస్ఐ సర్టిఫికెట్లు పొందాలి ప్రతి ప్లాంట్ లో రోజుకు నాలుగుసార్లు నీటిని పరీక్షించడానికి ప్రత్యేక ల్యాబ్ ఉండాలి. నిత్యం పరీక్షించే నీటి వివరాలను రికార్డుల్లో నమోదుచేయాలి. ఐఎస్ఐ గుర్తింపు రావాలంటే ప్లాంట్ల నిర్వాహకులు 35 రకాల సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ గోలంతా పట్టని చిన్నచిన్న ప్లాంట్ల యజమానులు అవేమీ లేకుండానే శుద్దిచేయని నీటినే బహిరంగంగా విక్రయిన్చేస్తున్నారు. మినరల్ వాటర్ అనే పేరుకు బదులుగా సుద్దిచేసిన త్రాగునీరు అనే పదాన్ని ఉపయోగించి లూజుగా మంచినీళ్ళను విక్రయిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నన్ని ప్లాంట్లు దేశంలో ఎక్కడా లేవని ఒక అధికారి వ్యాఖ్యానించడం విశేషం. ఈ ప్లాంట్లు వాడుతున్న ప్లాస్టిక్ క్యాన్లు, ప్యాకెట్లు కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ కాదని, ఇటువంటి మెటీరియల్ ను వాడటం వల్ల రక్తహీనత, నరాలు, శ్వాసకోశ, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు రావచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/hyderabad-24-12569.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





