హుజూరాబాద్ కు నిధుల వరద.. కేసీఆర్ ను ఈటల తట్టుకునేనా? 

Publish Date:Jun 17, 2021

Advertisement

ఇంకా నోటిఫికేషన్ రానే లేదు. ఎన్నికల హడావుడి అసలే లేదు. జస్ట్ రాజీనామా చేశారంతే. అంతే ఇక రంగంలోకి దిగిపోయారు గులాబీ నేతలు. రేపో మాపో పోలింగ్ అన్నట్లే హల్ చల్ చేస్తున్నారు. ఇన్నాళ్లు హుజూరాబాద్ ఏమైందో తెలియదు గాని..ఇక అది మరో హైదరాబాద్ అయిపోతుందన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. కొన్ని రోజుల్లోనే హుజూరాబాద్ డెవలప్ అయిపోతుంది అంటూ ప్రామిస్ చేసేస్తున్నారు.

ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క. ఆయన రాజీనామా చేసి బరిలోకి దిగుతున్నాడు. తమని ఇన్నిమాటలన్నవాడు గెలిస్తే ఎలా.. మన పరువేం కావాలి? పోటీ చేసేది బిజెపి తరపున అయినా సరే..బలంగా ఢీకొట్టి పిండి చేసేయాలన్నంత కసిగా కదులుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మంత్రి గంగుల కమలాకర్ అయితే అసలు ఇన్నాళ్లు హుజూరాబాద్ లో అభివృద్ధే జరగలేదు..ఎందుకు చేయలేదు ఈటల రాజేందర్...మేం వచ్చాం ఇక చూడండి అభివృద్ధి ఎలా చేస్తామో? ఎన్ని నిధులు ఇస్తామో చూడండి అంటున్నారు.అంటే ఇప్పటిదాకా ఈటల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.. ఇక ఇప్పుడు జరుగుతుందంట. అదేమంటే ఈటల కేసీఆర్ ని నిధులు అడగలేదంట..పట్టించుకోలేదంట.. ఇప్పుడు చూడు అంటూ గంగుల గర్జిస్తున్నారు. ఈటల అనుచరులైతే హుజూరాబాద్ కరీంనగర్ జిల్లాలో లేదా..తెలంగాణలో లేదా..కేసీఆర్ దానిని పట్టించుకోరా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

టీఆర్ఎస్ మాత్రం హూజూరాబాద్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కనపడుతుంది. నోటిఫికేషన్ వచ్చాక నిధులు ఇవ్వలేరు కాబట్టి... దాని కంటే ముందే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో హడావుడి చేయాలని చూస్తోంది. దాని కోసం ఎన్నినిధులైనా ఇవ్వటానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చేలోపు... ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో టార్గెట్లు కూడా పెట్టుకున్నారంట.
ఇక ఎలక్షన్ ఇంజనీరింగ్ లో టీఆర్ఎస్ ఎటూ ఆరితేరిపోయింది.  అందుకే ఇప్పటి నుంచే కీలక మైన నేతల ఐడెంటిఫికేషన్ మొదలైపోయింది. వారు ఏ పార్టీ అయినా సరే..కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు..అన్ని పార్టీలలో కొన్నిఓట్లను అయినా వేయించగలిగేవారైతే చాలు...వారిని గుర్తించి..వారికేం కావాలో అవి ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వాళ్లకు ఫోన్లు వస్తున్నాయనే టాక్ ఉంది.

అలా అటు ప్రభుత్వం నుంచి నిధులు... ఇటు పార్టీ నుంచి పైసలు రెండూ కుమ్మరించి హుజూరాబాద్ ను నిలబెట్టుకోవాలని..ఈటల రాజేందర్ కి షాక్ ఇవ్వాలని కేసీఆర్ గట్టి పట్టు మీదున్నట్లు కనపడుతోంది. అభ్యర్ధి విషయంలో కూడా చాలా లెక్కలు వేసుకుంటున్నారు. ఎల్ రమణను టీఆర్ఎస్ లో చేర్చుకుని టిక్కెట్ ఇస్తారని..ప్రచారం జరిగింది. తర్వాత పెద్దిరెడ్డి పేరు వచ్చింది. అప్పటికే కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పేరు కూడా వినపడింది. ఇప్పుడు తాజాగా వారందరినీ కాదని ముద్దసాని దామోదర రెడ్డి తమ్ముడు ముద్దసాని పురుషోత్తమ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆరు నూరైనా.. గెలవాలనే పట్టుదలలో టీఆర్ఎస్ ఉంది. మొత్తం మీద ఎవరు పుణ్యం చేసుకున్నాగాని... హుజూరాబాద్ దశ అయితే మారబోతుందనే అనిపిస్తోంది. నోటిఫికేషన్ కాస్త ఆలస్యంగా వస్తేనే బెటర్.. నియోజకవర్గం డెవలప్ మెంట్ అయిపోతుంది.
 

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.