పాపం బాలినేని.. పొగబెట్టినా బయటకెళ్లలేని పరిస్థితి?

Publish Date:Sep 29, 2023

Advertisement

పాపం బాలినేని.. పేరుకేమో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆప్తుడు, బంధువు. పార్టీలోనేమో  ఆయన పరిస్థితి కరివేపాకు చందం. పోనీ బయటకి వెళ్లిపోదామంటే ఎప్పటికప్పుడు బుజ్జగింపులు. ఎలాగోలా ఉందామంటే మనస్సాక్షిని చంపుకొని ఉండలేని పరిస్థితి. మొత్తంగా బాలినేని పరిస్థితి ప్రత్యర్థి పార్టీ నేతలకు కూడా రాకూడదని అంటూ జాలిపడుతున్నారు సొంత పార్టీ నేతలు. పార్టీలో తగిన గౌరవం లేకపోవడం.. ఆ బాధను వెళ్లగక్కుతూ అల్టిమేటం జారీచేయడం.. ఇంతలోనే తాడేపల్లి నుండి పిలుపు రావడం.. అక్కడ బుజ్జగింపులు.. కాలరెగరేసుకుని బయటకు వచ్చినా  పార్టీలో ప్రాధాన్యత విషయంలో షరామామూలు పరిస్థితి.. గత నాలుగేళ్లుగా బాలినేని పరిస్థితి పార్టీలో ఇలాగే కొనసాగుతోంది.  ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్‌ కీలక నేత. నాడు వైఎస్సార్.. నేడు జగన్ హయాంలోనూ ఓ వెలుగు వెలిగారు. అయితే, ఇదంతా వైసీపీ అధికారంలోకి రాకముందు మాట. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బాలినేనికి ప్రాధాన్యత  సంగతి అటుంచి కనీస గౌరవం, మర్యాదా కూడా లేకుండా పోయింది.  

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బాలినేనికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అంతకు ముందు ఆయన మంత్రి పదవిని వదులుకొని జగన్ వెంట వచ్చారు. బహుశా అందుకే  తొలి క్యాబినెట్ లో ఆయనకు అవకాశం దక్కింది. కానీ  మంత్రి వర్గ విస్తరణలో బాలినేనిని మంత్రి పదవి నుంచి జగన్ తప్పించారు. అదే సమయంలో అదే ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్ ను కేబినెట్ లో కొనసాగించారు.  దీనిపై బాలినేని మనస్తాపానికి గురయ్యారు. దానిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డెక్కారు. చివరికి తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు వచ్చింది. బుజ్జగించారు. బాలినేని సర్దుకు పోయారు. ఇఖ అక్కడ నుండి వైసీపీలో ఆయనను పక్కన పెట్టేయడం ఆరంభమైంది. ఇది కాస్త తారాస్థాయికి చేరడంతో బాలినేని ఆ మధ్య అసంతృప్తికి లోనయ్యారు. కారణామేంటా అని ఆరాతీస్తే.. సొంత జిల్లాలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతో కినుకు వహించారని తేలింది. ఆఖరికి పోలీసులు, ఎమ్మార్వోలు, ముఖ్య అధికారుల బదిలీల విషయంలో కూడా ఆయనకు తెలియకుండానే అన్నీ  జరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటకు చెప్పుకుని ఆవేదనకు గురయ్యారు.  అప్పట్లో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది.

అప్పట్లో బాలినేని అసంతృప్తికి కారణం వైవీ సుబ్బారెడ్డే అని అందరికీ తెలిసిందే. నిజానికి సుబ్బారెడ్డి, బాలినేనికి ఇద్దరికీ సీఎం జగన్ తో బంధుత్వం ఉంది. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి ఇద్దరూ కలిసే పార్టీ కోసం పని చేసారు. కానీ, తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. అధిష్టానం సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంతో బాలినేని అలకబూని మీడియాకెక్కారు. దీంతో అధిష్టానం పిలిచి బుజ్జగించడంతో అప్పటికి అది సమసిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి బాలినేనికి అదే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిలను  పార్టీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాలినేనికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. 

తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన బాలినేని.. 48 గంటల్లోగా తన అనుచరులను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డైరెక్ట్ గా జగన్ ను కలుస్తానని హెచ్చరికలాంటి అల్టిమేటమ్ జారీ చేశారు. అయితే, పరిస్థితి చూస్తే మాత్రం బాలినేనిరి  పొమ్మనలేక పొగబెడుతున్నారనే చర్చ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తున్నది. ఇదంతా సీఎం జగన్ కు తెలిసే జరుగుతోందని కూడా అంటున్నారు. బాలినేనిని పక్కన పెట్టడం అనే కార్యక్రమం అంతా  సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని అంటున్నారు. తాజాగా విజయసాయిరెడ్డిని ఈజిల్లాకు ఇన్ చార్జ్ గా నియమించారు. కానీ, బాలినేనికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పిన అధిష్టానం.. బాలినేనే జిల్లాను చూసుకుంటారని కూడా చెప్పారు.

కానీ పరిస్థితి చూస్తే మాత్రం తేడాగా కనిపిస్తుంది. మొన్నటి వరకూ వైవీ సుబ్బారెడ్డి బాలినేనికి బల్లెంలా తయారైతే ఇప్పుడు విజయసాయిని స్వయంగా అధిష్టానమే పంపించడం చూస్తుంటే జగన్ కే  బాలినేని జిల్లాపై పెత్తనం చేయడం ఇష్టంలేదన్న అనుమానాలు పార్టీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి.  అయితే పలుమార్లు అవమానించినా బాలినేని మాత్రం పార్టీని పట్టుకు వేలాడడం ఆయన అనుచరులకు సుతరామూ నచ్చడం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండంటూ ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. చూడాలి ఇప్పటికైనా బాలినేని ఆయన దారి ఆయన చూసుకుంటారా? లేక మళ్ళీ బుజ్జగింపులకు తలొగ్గి పార్టీలోనే కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.