వర్షాకాలంలో ఒక్క జబ్బు రాకూడదంటే.. ఈ ఆయుర్వేద మూలికలు తీసుకోండి..!

Publish Date:Jul 1, 2024

Advertisement

 

దేశంలో పలు ప్రాంతాలలో వర్షాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఈ వర్షాల కారణంగా ఇన్ఫెక్షన్లు కూడా వ్యాపిస్తున్నట్టు వార్తల సమాచారం. ఈ వర్షాల కారణంగా ప్రతి ప్రాంతంలోనూ ఆరోగ్య సమస్యలు రావడం సాధారణం. వీటిలో ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్,  డయేరియా, డెంగ్యూ,  మలేరియా, టైఫాయిడ్,  చర్మ ఇన్ఫెక్షన్లు,  అలర్జీలు ఎక్కువగా ఉంటాయి.   అయితే రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లను అయినా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వర్షాకాలంలో ఒక్క జబ్బు రాకూడదంటే  తీసుకోవాల్సిన ఆయుర్వేద మూలికలు కొన్ని ఉన్నాయి.

అల్లం..


అల్లంలో  యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీ ఆక్సిడెంట్ గుణాలు   పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యల వరకు అన్నింటిలో అల్లం మేలు చేస్తుంది. వర్షాకాలంలో ప్రతిరోజూ అల్లం టీ తాగడం ద్వారా  అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.


పసుపు..


ఔషధ గుణాలను మెండుగా కలిగి ఉన్న  పసుపులో  యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.  ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది.  జలుబు, దగ్గు, గొంతు నొప్పి,  శరీరంలో వాపు ఉంటే పాలలో పసుపు కలిపి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

అతిమధురం..


దగ్గు, జలుబు, గొంతునొప్పి వర్షాకాలంలో ఇబ్బంది పెడతాయి. దీనికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన అతిమధురం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని టీగా లేదా డికాషన్ రూపంలో తీసుకోవచ్చు.


తులసి..

తులసి ఆయుర్వేదంలో చాలా ప్రభావవంతమైన ఔషధ మూలిక. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్,  యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో ఉంటాయి. ఇది వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగవచ్చు. లేదంటే తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు.


తిప్పతీగ..

తిప్పతీగ రోగనిరోధక శక్తిని బలపరిచే ఔషధం. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది జలుబు, జ్వరం,  ఫ్లూ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో ప్రతిరోజూ తిప్పతీగ  కషాయాన్ని తయారు చేసి త్రాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.


                                             *రూపశ్రీ.


 

By
en-us Political News

  
కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.
బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది.
ఇష్టమైన ఆహారం తింటూనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ సూచించిన అట్కిన్స్ డైట్ ప్లాన్ విశేషాలు తెలుగులో తెలుసుకోండి.
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.