చిన్నతనంలోనే పిల్లలు సంస్కారవంతులు కావాలంటే. ఈ 5 అలవాట్లు నేర్పాలి..!

Publish Date:Dec 23, 2024

Advertisement


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నవయస్సులోనే మంచి విలువలను అందించాలని, తమ పిల్లలు సంస్కార వంతులుగా ఉండాలని అనుకుంటారు. దీనికి తగినట్టుగానే తమ పిల్లలను బాగా పెంచి, ఎన్నో విషయాలు నేర్పాలని.. నలుగురు తమ పిల్లల ప్రవర్తన గురించి గొప్పగా చెప్పుకునేలా తమ పిల్లలను  తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలా ఉండటం కోసం  కొందరు తల్లిదండ్రులు  తమ పిల్లలకు మొదటి నుండి ధార్మిక విద్యను అందిస్తారు.  తద్వారా వారి పిల్లలు తమ పెద్దలను గౌరవిస్తారు.  నాగరిక జీవితం గడుపుతారు. కానీ ఇప్పటి కాలంలో పిల్లలకు విలువలు నేర్పడం సవాల్ తో కూడుకున్నది.  చిన్న పిల్లలు కూడా పెద్ద మాటలు మాట్లాడతారు,  ప్రశ్నిస్తారు,  వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా ఏదైనా ఒక మంచి విషయా్న్ని పిల్లలకు చెప్పాలని అనుకున్నప్పుడు ఎగతాళి చేయడం,  చాదస్తంగా చూడటం ఇప్పటి తరం పిల్లల అలవాటు.  అయితే చిన్నతనంలోనే సంస్కారవంతులు కావాలంటే కింద చెప్పుకునే 5 అలవాట్లు పిల్లలకు నేర్పాలి.


కృతజ్ఞత..

మీ పిల్లలను కృతజ్ఞత కలిగి ఉండేలా పెంచాలి. ఇది ఇతరుల మనసులలో పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రేమ,  గౌరవం రెండింటినీ పెంచే అలవాటు.  కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా  అవతలి వ్యక్తులు చాలా సాటిసిఫై అవుతారు.  దీనివల్ల సంబంధాలు బాగుంటాయి. నలుగురు పిల్లల నడవడికను మెచ్చుకుంటారు.    పిల్లలకు ఎవరైనా మంచి చేస్తే, చాక్లెట్, బొమ్మలు లేదా బహుమతి ఇచ్చినా, పిల్లలకు ఏదైనా సహాయం చేసినా వారు వెంటనే సహాయం చేసిన వ్యక్తికి థ్యాంక్యూ చెప్పేలా అలవాటు చేయాలి.

దయ..

పిల్లలు చాలా అమాయక హృదయులు.  పిల్లలలో ఉన్న ఈ అమాయకత్వాన్ని కాపాడుకోవాలి. దీనికోసం వారికి దయా గుణాన్ని అలవాటు చేయాలి. ఇది పిల్లలను చాలా సరళంగా ఉండేలా చేస్తుంది. పిల్లలకు దయతో కూడిన చిన్న పాఠాలు, నీతి కథలు,  సంఘటనలు చెబుతూ ఉండాలి. జంతువులు,  పక్షులపై దయ చూపడం వంటివి చేయాలి. చిన్న మొక్క నుండి పెద్ద జంతువులు, మనుషుల వరకు ప్రతి దాని పట్ల దయ కలిగి ఉండేలా అలవాటు చెయ్యాలి.


బుద్దిగా..

ఈ ప్రపంచంలో చాలా వరకు ఏ విషయం పట్ల బుద్దిగా ఉండటం అనేది కనబడటం లేదు.  మనస్ఫూర్తిగా ఉండటం,  ప్రతి క్షణం అవగాహనతో  ఉండటం చాలా మందికి తెలియదు. నిజానికి ఇలా అటెన్షన్  గా ఉండటం అనేది ఒక కళ అని అంటారు.   ఈ కళ అందరికీ తెలియదు.  పిల్లలు బుద్ధిపూర్వకంగా ఉండటానికి చాలా  మార్గాలను నేర్పించవచ్చు. లోతైన శ్వాస తీసుకోవడం, ఎవరైనా మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినడం,  కళ్ళు మూసుకుని కాసేపు చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుభూతి చెందడం వంటివి ఇందులో ఉన్నాయి.

 క్షమాపణ..


ఎనపైనా ఒర వ్యక్తి తప్పు చేశాడని తెలిసినా క్షమించడం అంత సులభం కాదు. కానీ  మనస్సును ఒకసారి నియంత్రించుకుంటే, క్షమించడం అనేది చాలా సులభం. క్షమాపణ కళను పిల్లలకు నేర్పాలి.  ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కంటే క్షమించేవాడు గొప్పవాడు. దయగల వ్యక్తులు మాత్రమే క్షమించగలరని పిల్లలకు చెప్పాలి.


ఆధ్యాత్మికత..

ప్రతి బిడ్డ మనసులో ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలను ఆధ్యాత్మికతతో అనుసంధానించాలి. ఉదాహరణకు, ఈ ప్రపంచం చాలా అందంగా ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని పిల్లలను అడగండి? ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారని పిల్లలను అడగండి? పిల్లలకు ఆధ్యాత్మికతకు సంబంధించిన కొత్త విషయాలను కూడా చెప్పాలి.  తద్వారా వారు మరింత తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

                                               *రూపశ్రీ.

By
en-us Political News

  
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.