తెలుగుదేశం గూటికి పురంధేశ్వరి కుమారుడు.!

Publish Date:Aug 12, 2026

Advertisement

ఏపీ పాలిటిక్స్ లో  ఆసక్తికరమైన  పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మనవడు, పురందేశ్వరి కుమారుడు   దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.  నందమూరి, దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో..  హితేష్ చెంచురాం టిడిపి కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

తెలుగుదేశం  ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పుడు తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు హితేష్ తెలుగుదేశం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టనున్నారు.   కుటుంబ బంధాలు,  రాజకీయ వేదికలు ఏకతాటిపైకి రావడం పార్టీలో నూతనోత్తేజాన్ని నింపుతుందని పరిశీలకులు అంటున్నారు.  లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దగ్గుబాటి హితేష్   రాజకీయ ప్రవేశం వెనుక కుటుంబ పెద్దల సహకారం, పొత్తుల సమీకరణాలు   ఉన్నాయని అంటున్నారు. గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా దగ్గుబాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  చంద్రబాబు నాయకత్వంలో  తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేసేందుకు  హితేష్ ను తెలుగుదేశంలో చేర్చడం ద్వారా ఈ దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. బాపట్ల జిల్లా కారంచేడు పరిధిలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హితేష్ క్రియాశీలకంగా పాల్గొన్నారు.  అలాగే స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి సొంతంగా నిధులు కేటాయించడం వంటి అంశాలు ఆయన రాజకీయ ప్రవేశానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

2019 శాసనసభ ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ఆయన కుమారుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ పోటీ చేయాలని భావించినప్పటికీ,  సాంకేతిక సమస్యల కారణంగా ఆయన స్థానంలో తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. ఆ ఎన్నికల అనంతరం దగ్గుబాటి తండ్రీకొడుకులు వైసీపీకి,   రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా..  దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగుతూ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇటీవలి కాలంలో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం  పెరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లడం, కుటుంబ వేడుకలు,  పుస్తకావిష్కరణల సందర్భంగా చంద్రబాబు, దగ్గుబాటి ఒకే వేదిక పంచుకోవడం వారి మధ్య దూరం తగ్గిపోయిందనడానికి సాక్ష్యంగా నిలిచాయి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ మూడు కుటుంబాల మధ్య  బంధం మరింత బలపడింది. ఈ సఖ్యతే హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీలో చేరడానికి  మార్గం సుగమం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Hitesh Chenchuram TDP Entry, Daggubati Hitesh Chenchuram, NTR Grandson Political Entry, TDP New Political Developments,  Daggubati Family, TeluguOne

By
en-us Political News

  
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.