హుజూరాబాద్‌ లో హైటెన్షన్... బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

Publish Date:Jun 25, 2024

Advertisement

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో హై టెన్షన్‌ నెలకొంది. ఆధిపత్య పోరులో … నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బిఆర్‌ఎస్‌ నాయకులు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. గతంలో ఫ్లైయాష్‌ విషయంలో మంత్రి పొన్నంపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ ఛార్జి ప్రణవ్‌ స్పందించి.. ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి పై ఆరోపణలు చేశారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినట్లు, రైస్‌ మిల్లర్లు, ఇసుక మాఫియా వద్ద డబ్బులు వసూలు చేశారని, పూర్తి ఆధారాలతో చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తున్నానని, నీకు ధైర్యం ఉంటే నీవు కూడా వచ్చి డబ్బులు తీసుకోలేదని ఆంజనేయుని పై ప్రమాణం చేస్తావా అని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ నాయకులు విసిరిన సవాల్‌ ను స్వీకరించిన కౌశిక్‌ రెడ్డి.. నేడు చేల్పూర్‌ హనుమాన్‌ దేవాలయానికి బయలు దేరారు.  ఇద్దరి సవాళ్లకు చెల్పూర్‌ ఆంజనేయ స్వామి ఆలయాన్ని వేదిక చేసుకోవడంతో ఈ రోజు 11 గంటల సమయంలో అక్కడ ఏం జరుగుతుందో అనే టెన్షన్‌ నెలకొంది. పోలీసులు ముందుగానే చెల్పూర్‌కు వెళ్లి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

ఫ్లైయాష్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలు ప్రతివిమర్శలు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరుపార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  

మంత్రి పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రణవ్ తోసిపుచ్చారు. కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ చెల్పూర్ హనుమాన్ టెంపుల్‌లో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన పాడి.. మంగళవారం ఉదయం వీణవంకలోని తన నివాసం నుంచి చెల్పూర్ బయలుదేరగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు, ప్రణవ్ కూడా చెల్పూర్ బయలుదేరారు. దీంతో పోలీసులు హనుమాన్ దేవాలయం వద్ద 144 సెక్షన్ ను అమలు చేశారు. హుజురాబాద్, జమ్మికుంట రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎవ్వరినీ అక్కడికి అనుమతించడం లేదు. హనుమాన్ టెంపుల్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లనీయకపోవడంతో తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు అని కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ప్రమాణం చేశారు. కాషాయ వస్త్రాలతో తలస్నానం చేసి, తడిబట్టలతోనే దేవుడి చిత్రపటంపై ప్రమాణం చేశారు. ఫ్లైయాష్ తరలింపులో రూ.100 కోట్ల అవినీతి, ఓవర్ లోడ్ లారీల విషయంలో అవినీతికి పాల్పడలేదని తన మాదిరిగానే ప్రమాణం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఛాలెంజ్ చేశారు. టీటీడీ ఆలయంలో ప్రమాణం చేయడానికీ సిద్ధమని, తానొక్కడినే వస్తానని చెబుతూ.. దమ్ముంటే ప్రమాణం చేసేందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.