మోహిత్ రెడ్డిని అలా ఎలా వదిలేశారు?

Publish Date:Jul 30, 2024

Advertisement

హత్యాయత్నం కేసులో అరెస్టు చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చి వదిలేయడంపై హైకోర్టు విస్తుపోయింది. పోలీసులను తప్పుపట్టింది. అయితే పోలీసులకు మద్దతుగా ప్రభుత్వ లాయర్ వాదించారు. 

అసలు రాష్ట్రంలో అధకారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా పోలీసుల తీరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహారం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జగన్ అరాచపాలనను భరించలేక జనం ఆయన ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ అఖండ మెజారిటీ ఇచ్చి మరీ తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి కూడా రెండు నెలలు కావస్తున్నది. అయినా ఇంకా క్షేత్ర స్థాయిలో మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో జగన్ పార్టీ నేతల మాటే చెల్లుబాటు అవుతోందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అందుకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడి అరెస్టు విడుదల ఉదంతమే తాజా ఉదాహరణ. 

పులివర్తి నానిపై  హత్య యత్నం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ చెక్కేయడానికి రెడీగా ఉన్న మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జైలుకు మాత్రం తరలించలేదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకుంటున్న సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా పక్కనే ఉన్నారు. అందుకే ఏం మతలబు చేశారో తెలియదు కానీ పోలీసులు మాత్రం మోహిత్ రెడ్డికి 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టేశారు. మోహిత్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించడం జరగాల్సి ఉండగా పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించారు.

దీంతో పోలీసులను కోర్టు నిలదీసింది. హత్యయత్నం కేసులో నిందితుడికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేసిన  సంఘటన గతంలో ఎన్నడైనా ఉందా అని ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నించిన సంగతిని పక్కన పెడితే మోహిత్ రెడ్డి పట్ల పోలీసులు చూపిన ఔదార్యం తెలుగుదేశం శ్రేణులలో తీవ్ర ఆగ్రహానికి  కారణమౌతోంది. ఇటువంటి తీరు తెలుగుదేశం కూటమి శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. 

జగన్ హయాంలో 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసుల్లో కూడా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా తెలుగుదేశం నేతలు, శ్రేణులను అరెస్టులు చేశారు. అదే తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో కూడా అరెస్టు చేసి జైలుకు తరలించాల్సిన కేసుల్లో కూడా వైసీపీ నేతలకు 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టేస్తున్నారు.  సోషల్ మీడియా కేసుల్లోనే తలుపులు బద్దలుకొట్టి మరీ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన ఉదంతాలను గుర్తు చేస్తూ  ఇప్పుడు పోలీసులు మోహిత్ రెడ్డిపై అంతులేని ఔదార్యాన్ని ప్రదర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.