మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు న్యాయరాజధాని అంటూ ఐదేళ్ల పాటు పిల్లిమొగ్గలు వేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ అంటూ అసలు రాజధానే లేకుండా చేసి, ప్రజాగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోయారు. అయితే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ ప్రకటించి.. రాజధాని నగర నిర్మాణానికి బాటలు వేశారు. ఆయన హయాంలో శరవేగంగా నిర్మాణ పనులు సాగాయి. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఉద్దేశ పూర్వకంగా అమరావతిని నిర్వీర్యం చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కొత్త డ్రామాకు తెరలేపి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు జోరందుకున్నాయి. తొలి నుంచీ రాష్టరానికి ఒకే రాజధాని, అది అమరావతే అంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు ఆ దిశగా అడుగుల వేగం పెంచారు. అదే సమయంలో విశాఖ, కర్నూలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టారు.
ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ అన్న ఆ ప్రాంత వాసుల చిరకాల డిమాండ్ నెరవేరబోతున్నది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జీల బృందం కర్నూలులో పర్యటించనుంది. భవనం ఎంపిక తదితర అంశాలన్నీ సజావుగా పూర్తయిపోయి.. ఈ ఏడాది చివరికల్లా కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత గత ఏడాది నవంబర్ 21న కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు అసంబ్లీ తీర్మానం చేసింది. అంతకంటే ముందు హైకోర్టు శాశ్వత బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసే విషయంలో అభిప్రాయాలను తెలియజేయడానికి హైకోర్టు ఫుల్ బెంచ్ ముందు ఈ అంశాన్ని ఉంచాలని కోరుతూ రాష్ట్ర న్యాయసాఖ కార్యదర్శి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాశారు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని వేశారు.
ఆ కమిటీ నివేదిక మేరకు ఈ ఏడాది జనవరి 29న హైకోర్టు రిజిస్ట్రార్ కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు కావలసిన సదుపాయాల గురించి వివరిస్తూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. కోర్టు కాంప్లెక్స్, న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస వసతి, న్యాయవాదులకు వసతి సౌకర్యాల పూర్తి సమాచారాన్ని పంపాలని ఆ లేఖలో కోరారు. ఆ లేఖపై కర్నూలు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన లేఖలో ఉన్న విధంగా సౌకర్యాలు కల్పించేందుకు భవనాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కర్నలు మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్, ఆర్డీవోలను ఆదేశించారు. ఇప్పుడు 15 మంది న్యాయమూర్తుల బృందం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు కర్నూలు రానుంది. న్యాయమూర్తుల బృందం ఈ నెల6న కర్నూలులో పర్యటించనుంది. అన్ని సజావుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికే కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/high-court-bench-in-kurnool-by-end-of-this-year-39-192248.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.