తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు
Publish Date:Jun 10, 2026
Advertisement
ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, నారాయణఖేడ్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కాగా.. రానున్న 24 గంటల్లోనూ ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయనివాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనీ, పలు చోట్ల పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
http://www.teluguone.com/news/content/heavy-rains-in-the-telugu-states-36-222456.html





