హుజురాబాద్ లో హరీష్ స్కెచ్? విపక్షాలకు చుక్కలేనా..? 

Publish Date:Jul 1, 2021

Advertisement

హుజురాబాద్ నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలుపు తెరాసకు, అవసరం. ఒక్క తెరాసకు మాత్రమే కాదు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కూడా కీలకం. అయితే, తెరాసకు  కొంచెం ఎక్కువ అవసరం.ఇది ముఖ్యమంత్రి కేసీఆర్’కి ఇజ్జద్ కి సవాల్.అందుకే,గులాబీ బాస్, హుజురాబాద్ బాధ్యతలను, హరీష్ రావుకు అప్పగించారు. హరీష్ రావుకు బాధ్యత అప్పగిస్తే, ఇక తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు అనేది, కేసీఆర్ మొదలు తెరాస సాధారణ కార్యకర్త వరకు అందరికీ ఉన్న విశ్వాసం. మొన్నటి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అయితే, అదే మాట హరీష్ రావు స్వయంగా చెప్పుకున్నారు. “నేను ఎక్కడికి వెళ్ళినా, అక్కడి నుంచి గెలుపునే పట్టుకెళతాను” అని చాలా విశ్వాసంతో ప్రకటించుకున్నారు. ఫలితం ఏమిటో వేరే చెప్ప నక్కరలేదు. అయితే, అంత మాత్రం చేత, దుబ్బాక నుంచి ఆయన ఓటమిని పట్టుకెళ్ళారు, కాబట్టి, హరీష్ ఆట అయిపోయిందని అనుకోలేము. ఆ తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆఖరి  నిముషంలో పీవీ కుమార్తె వాణీదేవిని అభ్యర్ధిగా ప్రకటించినా, హరీష్ మరోసారి తన సత్తా నిరుపించుకున్నారు. ఆమెను గెలిపించారు. అందుకే రాజకీయాల్లో అట అయిపోవడం ఉండదు,  24X 7 మ్యాచ్ నడుస్తూనే ఉంటుంది.  

అందుకే మళ్ళీ అత్యంత కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను కేసీఆర్, అల్లుడు హరీష్’కు అప్పగించారు. నిజమే, బాధ్యత హరీష్ మీద ఉంచినా, కీసీఆర్ మొదలు చిన్నాపెద్ద నాయకులు అందరూ, హుజురాబాద్ గెలుపు కోసం, మేము సైతం’ అంటూ నడుం బిగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులంతా ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ప్రచారం ప్రారంభించారు. ఎవరికి అప్పగించిన పనిని వారు ఇంచక్కా చక్క బెట్టేస్తున్నారు. గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ సహా పలువురు టీఆర్ఎస్ నేతలందరూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  మధ్య మద్యలో మంత్రులు వెళ్లి వస్తున్నారు. అన్నిటినీ మించి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదో ఒక పేరున జనంలోకి వెళ్లి ‘లైవ్ ‘ లో ప్రచారం చేస్తున్నారు. 

ఇక  హుజురాబాద్ ఉప  ఏన్నిక ఎపిసోడ్’ ప్రధాన పాత్రదారి, మాజీమంత్రి ఈటల రాజేందర్, ఆయన వెంట బీజేపీ సేనలు, ప్రచారం సాగిస్తున్నారు. ఈటల తమ మాజీ బాస్’కు ఏ మాత్రం తీసిపోకుడా ఆయన భాషలో సమాధానం చెపుతున్నారు. ఇరువర్గాల నాయకులు మధ్య  విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జోరుగా సాగుతున్నాయి. నిజానికి, ఉపఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాకపోయినా, ఇప్పటికే హుజురాబాద్’ లో ఎన్నికల సందడి మొదలైంది. అదలా, ఇంతవరకు కాస్త స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోనూ  రేవంత్ రెడ్డి రాకతో జోష్ పెరిగింది. రేపు జులై 7 పీసీసీ ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రంగంలోకి దిగితే, ఇక అసలు కథ  అప్పుడుమొదలవుతుంది.   

ఇంత జరుగుతున్నా  హరీష్ మాత్రం ఇంతవరకు అటుగా వెళ్ళలేదు. హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. హుజురాబాద్ గడప తొక్కలేదు. కథ మొత్తం హైదరాబాద్, సిద్దపేట నుంచే నడిపిస్తున్నారు.అంతా బానే వుంది, అయితే, హరీష్ ఎందుకు దూరంగా ఉంటున్నారు?  దుబ్బాకలో, ‘ఒరేయ్ బండి సంజయ్ ...’ అంటూ గర్జించిన హరీష్ హుజురాబాద్ విషయంలో తెరవెనక పాత్రకే ఎందుకు పరిమితం అవుతున్నారు, అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కూడా  వినిపిస్తున్నాయి. అలాగే ఏవేవో వ్యుహాగానాలు కూడా వినిపిస్తునాయి.  అయితే, హరీష్ తెర మీద కనిపించక పోయినా, ఆయన స్కెచ్ ప్రకారమే కథ నడుస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. హుజురాబాద్, వ్యవహారం అంతా ఆయన  కనుసన్నల్లోనే జరుగుతోందని, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత హరీష్ రియల్ ఎంట్రీ ఉంటుందని పార్టీ  వర్గాలు చెపుతున్నాయి. 

ప్రస్తుతం హరీష్ పార్టీలో చేరికలు, సమాలోచనలు కూడా హైదరాబాద్, సిద్దిపేట నుంచే నడిపిస్తున్నారు. నిన్న గాక మొన్న, కొందరు చోటామోటా బీజేపే నాయకులు కూడా హైదాబాద్ వచ్చి అయన చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఒక విధంగా హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని హరీష్ అధికార నివాసం, హుజురాబాద్ తెరాస ఎన్నికల కార్యాలయంలాగా మారిపోయింది. ఏమైనా హరీష్, మామూలోడు కాదు, మామకు తగ్గ అల్లుడు. కేసీఆర్ పదవులకు ఆయన వారసుడు అయినా కాకపోయినా, ఆయన రాజకీయ ఎత్తులు,వ్యూహ ప్రతివ్యుహాల చతురతకు మాత్రం ఆయనే నిజమైన వారసుడు అంటారు.గతంలో,  ఉద్యమ కాలం నుంచి అనేక సందర్భాలాలో అది రుజువైంది. ఇక ముందు కూడా అదే నిజం అవుతుందా లేదా అనేది హుజురాబాద్ ఫలితంతో  తెలుస్తుంది.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.