Publish Date:Dec 26, 2024
వైసీపీ హయాంలో మంచి చెడ్డలు, తప్పొప్పులతో పని లేకుండా జగన్ కు వ్యతిరేకం అని భావించిన వాళ్ల కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి. పోలీసుల జులం స్వాగతం పలికేది. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసే వారు. నోటీసుల మాటే లేదు. అనుకుంటే జైల్లో తోసేయడమేనన్నట్లుగా పరిస్థితి ఉండేది. తెలుగుదేశం, జనసేన నేతలూ కార్యకర్తలనే కాదు.. జగన్ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు వారికి ఇక భూలోకంలో నరకం చూపించడానికే రక్షక భటులు ఉన్నారన్నట్లుగా జగన్ హయాంలో అరాచకత్వం రాజ్యమేలింది.
ఐదేళ్ల పాటు జగన్ అరాచక, విధ్వంస పాలనను పంటి బిగువున భరించిన ప్రజలు ఎన్నికలలో తమ సత్తా చాటారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అవకాశం ఇవ్వకుండా జగన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు. జగన్ ఐదేళ్ల హయాంలో అష్టకష్టాలూ పడిన తెలుగుదేశం శ్రేణుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జగన్ మెప్పు కోసం ఉచ్ఛ నీచాలు మరిచి మరీ చెలరేగిపోయిన వారిపై చర్యలు ఉంటాయని ఆశించారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచినా గత పాలనలోని అవినీతి నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న నిరాశ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు, అధికారుల పేర్లు నమోదు చేశానంటూ లోకేష్ చూపిన రెడ్ బుక్ లో ఉన్న వారిపై చర్యలూ ప్రారంభం కాలేదు. అంతే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలతో చెలరేగిపోయిన వైసీపీయుల తీరు ఇప్పటికీ మారలేదు. దీంతో తెలుగుదేశం శ్రేణులలో అసహనం పెచ్చరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సరిగ్గా ఈ తరుణంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి జగన్ హయాంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీశారు. అక్కడితో ఆగకుండా ఫైబర్ నెట్ లో దొడ్డిదారిన కొలువులు పొందిన అనర్హులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా జగన్ కోసం తీసిన సినిమాలకు ఫైబర్ నెట్ ద్వారా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దారితప్పిన నిధుల రికవరీ కోసం లీగల్ నోటీసు కూడా పంపాడు. అంతే కాకుండా జగన్ ప్రాపంకంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా దొడ్డిదారిన అక్రమంగా కొలువులు పొందిన 410 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించారు. మరో 200 మందికి ఉద్యోగాల నుంచి ఎందుకు ఉద్వాసన పలకరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇలా దొడ్డిదారిన ఏపీ ఫైబర్ నెట్ లో కొలువులు పొందిన వారు ఎన్నడూ కార్యాలయానికి వచ్చిన పాపాన పోలేదు. కానీ కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద మొత్తాలలో జీతాలు తీసుకుంటున్నవారే. జగన్ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవకతవకలను బటయపెట్టి చర్యలకు ఉపక్రమించి జీవీ రెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు జగన్ హయాంలో అవినీతికి పాల్పడిన వారిపై, అక్రమాలకు తెగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ, రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారిపై కొరడా ఝుళిపించడంలో ఇంకా జాప్యం ఎందుకంటూ లోకేష్ సహా మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. జీవీరెడ్డి మాదిరిగానే అక్రమార్కులపై చర్యల విషయంలో వేగంగా స్పందించాలన్న డిమాండ్ పేరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gvreddt-gets-tdp-cadre-respect-25-190352.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.