ఎన్-95 మాస్క్ కరోనాను ఆపలేదు

Publish Date:Jul 21, 2020

Advertisement

ఇంట్లో తయారుచేసుకుంటేనే బెటర్

కేంద్ర ఆరోగ్య శాఖ సూచన

కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి అది ఎన్-95 మాత్రమే అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు  కవాటం ఉన్న ఆ మాస్క్ లు సురక్షితం కాదు అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్‌ జనరల్‌. వైరస్‌ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, కరోనా పాజిటివ్ వ్యక్తులు వీటిని ఉపయోగించినప్పుడు కవాటం వల్ల వైరస్ బయటకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైన సమయంలో ఈ మాస్క్ వాడటం వల్ల వైరస్‌ ఇరతులకు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు.  ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అయితే కవాటం ఉన్న మాస్క్ లు కాకుండా సాధారణ మాస్కులు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

కవాటం ఉంటే..
ఎన్ - 95 కవాటాలున్న మాస్క్  వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి. అయితే వదిలిన గాలిని మాత్రం శుద్ధి చేయకుండా నేరుగా వాతావరణంలోకి పంపిస్తుంది. కరోనా ఉన్న వ్యక్తులు వీటిని ధరించినప్పుడు వారు వదిలే గాలి ద్వారా వైరస్ వాతావరణంలోకి చేరుతుంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేసిన తరుణంలో ఈ మాస్క్ ల వాడకంపై చాలా దేశాలు నిషేధం విధించాయి. వదిలేసిన గాలిని నేరుగా వాతావరణంలో కలిపేలా ఉంటే మాస్కులు ధరించి ప్రయోజనం లేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. క్లాత్ తో తయారు చేసిన మాస్క్ లను వాడటమే ఆరోగ్యకరమని సూచించింది. కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి అమెరికా దేశాలు వీటిని నిషేధించాయి. ఇంట్లో తయారు చేసిన మాస్కులనే వాడాలని మన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రతిరోజూ...
ముక్కును, నోరును పూర్తిగా కవర్ చేసేలా క్లాత్ తో కుట్టిన మాస్క్ లు వాడటమే శ్రేయస్కరం. బయటకు వెళ్ళివచ్చిన తర్వాత
వేడి నీటిలో కనీసం ఐదు నిమిషాల పాటు నానపెట్టి శుభ్రంగా మాస్క్ ను ఉతకాలి. ఎండలో ఆరవేసిన తర్వాత తిరిగి వాడటం ఆరోగ్యకరం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరు వాడిన మాస్క్ లను మరోకరు వాడవద్దు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.