గిల్ కెప్టెన్స్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

Publish Date:May 9, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో శనివారం ( మే 9) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌ను 77 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 84 పరుగులు, సాయి సుదర్శన్ 55 పరుగులు అర్ధసెంచరీలతో రాణించారు.  దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక బౌలింగ్ లో రషీద్ ఖాన్33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాశించాడు.  

 మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి రాజస్థాన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఆ తరువాత సుదర్శన్ ఔటైనా, గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు.

230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా దూకుడుగానే ఛేదన ప్రారంభించింది.  ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ  16 బంతుల్లో 36 పరుగులు, ధ్రువ్ జురెల్  10 బంతుల్లో 24  మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్లకు 78 పరుగులతో పటిష్టంగానే కనిపించింది.

అయితే, స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. రషీద్ ఖాన్ తన మాయాజాలంతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. ప్రమాదకరంగా మారుతున్న జురెల్‌ను, ఆ తర్వాత ఫెరీరా, శుభమ్ దూబేలను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. చివర్లో రవీంద్ర జడేజా  38 పరుగులు చేసి  ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. గుజరాత్ బౌలర్లలో  జాసన్ హోల్డర్  3 వికెట్లు తీశాడు. రాజస్థాన్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. 

By
en-us Political News

  
ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రజాస్వామ్యం వచ్చింది. పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని చివరకు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
గచ్చిబౌలి ప్రాంతంలో లిఫ్టులు ఇరుక్కుని చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బంగారాన్ని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది.
అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. కేసులోని కీలక సాక్షులను ప్రలోభపెట్టడమే కాకుండా, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన బెదిరించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.