టాలీవుడ్.. రేవంత్ సర్కార్ మధ్య గ్యాప్ తగ్గినట్లేనా?

Publish Date:Jan 1, 2025

Advertisement

సినీ పరిశ్రమ వర్సెస్ రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయిందా? అన్న ప్రశ్నకు ఔనన్న సమాధానమే వస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచే బీఆర్ఎస్ తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాన్ని ఎగదోసి రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు సినీ పరిశ్రమ నుంచే వస్తున్నాయి. ఇంత కాలం సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన, తదననంతర పరిణామాలు అంటే.. అల్లు అర్జున్ అరెస్టు, కొత్త సినిమాలకు ప్రీమియర్ షోలు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి నిరాకరణ వంటి సంఘటనలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేటీఆర్ అయితే రేవంత్ టార్గెట్ గా ఈ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమకు ఒకింత ఇబ్బందికరంగా మారాయి. 
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మరచిపోయారనీ, ప్రముఖులకే రేవంత్ ఎవరో తెలియని పరిస్థితి ఉంటే ఇక సామాన్యులకు ఆయన ఎలా తెలుస్తారనీ కేటీఆర్ చేసి వ్యాఖ్యలు సినీ పరిశ్రమ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అంతే కాకుండా సినీ ప్రముఖులతో భేటీలో రేవంత్ సూటిగానే పరిశ్రమను అడ్డు పెట్టుకుని కేటీఆర్ తనను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలకు పరిశ్రమ పెద్దల నుంచి కౌంటర్ ఎందుకు రావడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నకు సినీ ప్రముఖల వద్ద నుంచి సమాధానం లేకుండా పోయింది. 
అయితే ఆ భేటీ తరువాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీటుగా సమాధానం ఇచ్చారు.  సినీ పరిశ్రమను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని కేటీఆర్ కు దిల్ రాజు చాలా స్పష్టంగా చెప్పారు.

చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన  సమావేశం  పూర్తి సుహృద్భావ వాతావ రణంలో జరిగిందని స్పష్టం చేసిన దిల్ రాజు.. అనవసర వివాదాల్లోకి సినీ పరశ్రమను లాడగం మంచిది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమను అడ్డం పెట్టుకోవద్దని ఒకింత ఘాటుగానే చెప్పారు. దిల్ రాజు ప్రకటన తరువాత సినీ పరిశ్రమలో ఒకింద ధీమా వ్యక్తం అవుతోంది. దిల్ రాజు వినా మిగిలిన సినీ ప్రముఖులెవరూ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించలేదు. అలాగే దిల్ రాజు ప్రకటనను స్వాగతిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. దీనిని బట్టే కేటీఆర్ వ్యాఖ్యలకు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న విషయం తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా సీఎం రేవంత్ తో భేటీ సందర్భంగా ఆ భేటీకి హాజరైన సినీ ప్రముఖులంతా పోటీలు పడి రేవంత్ పై ప్రశంసలు కురిపించడమే బీఆర్ఎస్, కేటీఆర్ అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని చాటినట్లైందని అంటున్నారు.  

ఇక అన్నిటి కంటే ప్రముఖంగా చెప్పుకోవలసినదేమిటంటే.. కేటీఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్ తో సినీ పరిశ్రమకు, రేవంత్ సర్కార్ కు ఉన్న గ్యాప్ తగ్గిపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే సినీపరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా సమస్యల పరిష్కారినికి ఒక వేదికను ఏర్పాటు చేసే బాధ్యతను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు తీసుకున్నట్లైంది. ఇటు ప్రభుత్వం తరఫునా, అటు సినీ పరిశ్రమ తరఫునా కూడా తన వాయిస్ ను వినిపించడానికి ఆయన ఎటువంటి భేషజాలూ లేకుండా ముందుకు వచ్చారు.

పరిశ్రమకు కావలసినవి ప్రభుత్వం ముందు ఉంచడంతో పాటు, ప్రభుత్వం పరిశ్రమ విషయంలో ఏ చేయాలని అనుకుంటోందన్నది పరిశ్రమ పెద్దలకు స్పష్టం చేశారు.  దీంతో ముందు ముందు సినీపరిశ్రమ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలతో పాటు పరిశ్రమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే వాతావరణాన్ని దిల్ రాజు కల్పించారన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాలలోనే కాకుండా పరిశీలకుల నుంచి కూడా వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.