తమ్మినేనికి గాంధీ గుబులు

Publish Date:Aug 3, 2023

Advertisement

ఓ వైపు ఎన్నికలు దూసుకొస్తున్నాయి. అలాంటి వేళ  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి సొంత నియోజకవర్గం అముదాలవలసలో కొత్త నొప్పులు మొదలైనాయి. సొంత పార్టీలోనే అసమ్మతి కాక.. ఆయనను కుదురుగా కూర్చోనివ్వడం లేదు. అముదాలవలస నియోజకవర్గంలో మొత్తం మూడు పార్టీ కార్యాలయాలు ఉండగా... వాటిలో ఎవరికీ వారే కోటరీలు ఏర్పాటు చేసుకొంటూ.. ప్రస్తుత ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం సీటుకు ఎసరు పెడుతున్నారు.   

జులై 31వ తేదీ ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సువ్వారి గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భారీగా ఫ్యాన్ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి. అయితే ఈ వేడుకలతో సువ్వారి గాంధీకి భారీగా మైలేజ్ పెరిగిందని అంటున్నారు. తమ్మినేని వర్గం కూడా అలాగే  భావిస్తోంది. అయితే  ఈ విషయాన్ని ముందే పసిగట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం వర్గం.. గాంధీ బర్త్ డే వేడుకలకు వైసీపీ శ్రేణులు హాజరుకాకుండా చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి ఫలించ లేదు. దీంతో సువ్వారి గాంధీ జన్మదిన వేడుకలు కాస్తా.. ఆయన గారి బలప్రదర్శనకు వేదిక అన్నట్లుగా మారిపోయాయి.

ఫ్యాన్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆమదాలవలస ఎమ్మెల్యే టికెట్‌ను సువ్వారి గాంధీ ఆశిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం... ఈ ఏడాది జరుపుకొంటున్న జన్మదిన వేడుకల ద్వారా తన సత్తాతోపాటు తన మాస్ ఫాలోయింగ్‌ని సైతం వైసీపీ అధినాయకత్వానికి చూపించాలని భావించారు. ఆ ఉద్దేశంతో.. భారీగా ఏర్పాటు చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు స్పీకర్ తమ్మినేనికి ఆమదాలవలస పట్టణంపై పూర్తి పట్టున్నా కూడా.. సువ్వారి గాంధీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరగడంతో.. ఫ్యాన్ పార్టీ అధిష్టానానికి కొత్త సంకేతాలు పంపినట్లు అయింది. 

ఇంకోవైపు ఈ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సువ్వారి గాంధీ తన ప్రసంగం ద్వారా.. ప్రజలను మరింతగా ఆకర్షించారు. అంతేకాదు రానున్న ఎన్నికల్లో.. తాను ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు సువ్వారి గాంధీ విస్పష్టంగా చెప్పారు. ఈసారి కనుక తనకు టికెట్ ఇస్తే.. ఆమదాలవలసలో తన విజయం ఖాయమని.. అందుకు తన వెనుక ఉన్న క్యాడరే బలమైన సాక్ష్యమని ఈ సందర్భంగా ఆయన   చెప్పారు. 

ఇక ప్రజా సమస్యల ప్రస్తావనలో వైలంట్‌గా ఉండే సువ్వారి గాంధీ.. నియోజకవర్గంలో పరిస్థితుల రీత్యా పొలిటికల్ స్పీచ్‌లలో కాస్త సైలెంట్‌గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి తన జన్మదిన వేడుకల సందర్భంగా సూటిగా సుత్తిలేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం... తనకు టికెట్ కేటాయించాలంటూ తన వాణిని బలంగా వినిపించడంతో  తమ్మినేని వర్గంలో గుబులు మొదలైంది. 

ఇప్పటికే నియోజకవర్గంలోని సమస్యలను తీర్చడంలో స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాం ఘెరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వేళ సువ్వారీ గాంధీ రూపంలో మరో సమస్య.. అదీ సొంత పార్టీ నుంచే స్పీకర్‌ తమ్మినేనికి ఎదురైందనే ఓ చర్చ సైతం స్థానికంగా ఊపందుకొవడం గమనార్హం.

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.