గాంధీ ఆసుపత్రిలో ఆగంతకుడు హల్చల్: గంటపాటు హైడ్రామా.!
Publish Date:Sep 28, 2026
Advertisement
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్చల్ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్ద ఉన్న రేకుల షెడ్‌పైకి ఎక్కిన అతడు.. చేతిలో పదునైన రాళ్లు పట్టుకుని కింద ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. తన దగ్గరకు ఎవరైనా వస్తే రాళ్లు విసిరేస్తానంటూ బెదిరించ డంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.షెడ్‌పై నుంచి కిందకు చూస్తూ రాళ్లు చేతిలో పట్టుకుని హల్ చల్ చేయడంతో ఆసుపత్రి కి వచ్చిన రోగులు, వారి సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అతడు ఎప్పుడు ఏం చేస్తాడోనన్న భయంతో సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరించారు. దాదాపు అరగంట పాటు షెడ్‌పైనే ఉంటూ కింద ఉన్నవారిపైకి రాళ్లు విసిరేస్తానంటూ బెదిరించ డంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. [ Gandhi Hospital, Secunderabad, Mental Health Patient, Hospital Incident, Stone Attack, Hospital Tension, Police Intervention, High Drama, Hospital Security, Telangana News, Hyderabad News, Patient Commotion, Gandhi Hospital Incident, Police Action, Security Alert ]
ఈ ఘటనతో గాంధీ ఆసుపత్రి వద్ద కొంతసేపు రాకపోకలు, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. అతడిని కిందకు దింపేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ.. రాళ్లు విసిరేస్తానంటూ హెచ్చరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా సిబ్బంది దూరంగా ఉండి అతడిని గమనిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మానసిక రోగిని కిందకు దింపేందుకు పోలీసులు కూడా జాగ్రత్తగా వ్యవహరిం చారు. కొద్దిసేపటి పాటు కొనసాగిన ఈ హైడ్రామా అనంతరం ఎట్టకేలకు అతడిని పోలీసులకు అదుపులోకి తీసుకు న్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువులు ఊపిరి పీల్చు కున్నారు.దాదాపు గంటపాటు కొనసాగిన ఈ ఘటన గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేపింది. రాళ్లతో హల్చల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.
http://www.teluguone.com/news/content/gandhi-hospital-25-232811.html





