Publish Date:Jun 14, 2025
గద్దర్ కి ఆస్కార్ కీ సంబంధమేంటన్న దానికన్నా.. గద్దర్ కి సినిమాలకూ ఉన్న సంబంధం కూడా చాలా చాలా తక్కువ. గద్దర్ ఎప్పుడో మా భూమిలో బండెనక బండి కట్టి అనే పాట.. అది కూడా బండి యాదగిరి అన్న మరో రచయిత రాసిన పాట పాడారు. ఆ తరువాత రంగుల కల సినిమాలో జమ్ జమ్మల మర్రి అనే పాట పాడారు. అది కూడా గూడ అంజయ్య అనే రచయత రాసిన పాట. తర్వాత ఆయన సినిమా తెరపై కనిపించింది జై బోలో తెలంగాణలో పొడుస్తున్న పొద్దు మీద అనే పాట ద్వారా మాత్రమే. ఆయనకూ సినిమాలకూ ఉన్న సంబంధం చాలా చాలా బలహీనమైనది. అయితే ఇక్కడ ఆస్కార్ కి గద్దర్ కీ ఉన్న పోలిక ఏంటంటే.. ఈ రెండు అవార్డులూ.. వ్యక్తుల పేర్లకు సంబంధించినవి. ఇక్కడ గద్దర్ అవార్డే ఆస్కార్ కన్నా ఒకందుకు గొప్ప. అదెలాగంటే అసలు ఆస్కార్ కీ సినిమాలకూ సంబంధమే లేదు.
కారణం.. 1939లో హాలీవుడ్ సినిమాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ సినిమాలకి అకాడమీ అవార్డులు ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ సమయంలో ఒక అవార్డు రూపు తయారు చేయాలని ట్రై చేశారు. శిల్పి జార్జి స్టాన్లీ 13 అంగుళాల ఎత్తు, ఎనిమిదిన్నర పౌండ్ల బరువుతో దీన్ని తయారు చేశారు. ఈ ఆస్కార్ రూపానికి ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను సూచిస్తుందిది. ఇదిలా ఉంటే ఈ సంస్థలో పని చేసే మార్గరెట్ హెరిక్ అనే మహిళ.. విజేతలకు అందించే ఈ బొమ్మను చూసి.. ఇది అచ్చం మా అంకుల్ ఆస్కార్ లా ఉందని అనడంతో.. ఈ అకాడమీ అవార్డులకు ఇచ్చే రూపానికి ఆస్కార్ అవార్డ్ గా పేరొచ్చిందని అంటారు.
దీంతో పోలిస్తే గద్దర్ పేరు పెట్టడంలో ఏమంత తప్పు లేదన్నది కొందరి వాదన. ఇదిలా ఉంటే.. మరికొందరు అవార్డు రూపంలో ఒక ఆస్కార్ లా.. గద్దర్ రూపం లేకుండా ఆయన చేతిలోని డప్పును మాత్రమే పెట్టడమేంటన్న మాట వినిపిస్తోంది. గద్దర్ కి ఇటీవల కట్టిన విగ్రహం నమూనాలో.. ఈ అవార్డు రూపం కూడా ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gaddar-cinema-awards-story-25-199919.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.