పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడ నుంచంటే?.. లోక్ సభకు నాగబాబు?

Publish Date:Dec 19, 2023

Advertisement

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేసిందా?  పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఎన్ని? ఏవి అన్నవిషయం కూడా నిర్ధారణ అయిపోయిందా? అంటే ఇరు పార్టీల నేతలూ ఔననే అంటున్నారు. అయితే ఆ వివరాల వెల్లడికి మాత్రం ఇంకా సమయం ఉందని చెబుతున్నాయి.   తాజాగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీలో  ఈ విషయంపైనే విస్తృత చర్చ జరిగిందంటున్నారు.  జగన్ ముక్త ఏపీ లక్ష్యంగా ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను కూడా నియమించుకొని సమష్టిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.  మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరగనుండడంతో పొత్తులు, సీట్ల అంశంలో ఇంకెంత మాత్రం జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో  ఇరు పార్టీలు ఈ దిశగా చర్చలు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా జనసేన  పోటీ చేసే స్థానాలపై చర్చ జరిగిందని చెబుతున్నాయి. అయితే  జనసేన పోటీ చేసే స్థానాలేమిటి? ఎన్ని అన్న విషయంపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలివే అంటూ అంటూ ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ధృవీకరించిన జాబితా కాకపోయినప్పటికీ.. అంచనాలకు, వాస్తవాలకు దగ్గరగా ఉండటంతో తెగ వైరల్ అవుతోంది.  

పొత్తులో భాగంగా జనసేన  24 స్థానాలలో పోటీ చేస్తుంది.  సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య ఇప్పటికే పలు ధఫాలు చర్చలు జరిగినట్లు తెలుస్తోండగా.. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో జనసేన పోటీ చేసే సంఖ్యను ఖరారు చేసినట్లు చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ జాబితా ప్రకారం.. రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు లేదా ఏలూరు లేదా నిడదవోలు  లేదా తణుకు, కొవ్వురు, పెడన, కైకలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, గిద్దలూరు, దర్శి, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, రాజంపేట, భీమిలి, గాజువాక, యలమంచిలి లేక పెందుర్తి, పాడేరు, రాజానగరం స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది.

 అలాగే రెండు లోక్ సభ స్థానాలలో కూడా జనసేన పోటీ చేస్తుంది. ఇక అన్నిటి కంటే ముఖ్యంగా  జనసేన   అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయనున్నారన్నది రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న. ఇక సామాజిక మాధ్యమంలో కూడా ఈ విషయంపై ఆసక్తికర సమాచారం వైరల్ అవుతోంది.  పవన్ భీమవరం, గాజువాకలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఉత్తరాంధ్రలోని విశాఖ నార్త్ లేదా   ఉమ్మడి  తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఒక చోట నుంచీ పవన్ పోటీ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియలో ప్రచారం అవుతోంది.  పవన్ కళ్యాణ్ అనంతపురం నుండి పోటీ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పవన్ పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని ఇప్పటికే ఇక్కడి నియోజకవర్గ ఇన్చార్జ్   ప్రభాకర్ చౌదరి ప్రకటించిన సంగతి తెలిసిందే.  దీంతో పవన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే  ఒక లోక్ సభ స్థానం నుండి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయనున్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలుగుదేశం, జనసేన అభ్యర్థులతో కలిపి తొలి జాబితా అభర్ధులను ప్రకటించే అవకాశం ఉండగా తొలి  జాబితాలో టీడీపీ స్థానాలను ఫైనల్ చేసినట్లు తెలుస్తున్నది. తెలుగుదేశం తొలి జాబితాలో 76 మంది పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ని 13  ఉమ్మడి   జిల్లాల నుంచి జిల్లాకు అయిదారుగురు వంతున ఈ తొలి జాబితాలో చోటు దక్కనుందని అంటున్నారు. పందొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉండగా..  ఎలాంటి గ్రూపు తగాదాలు లేకుండా, బలంగా ఉంటూ ప్రజలతో మమేకం అవుతున్న అభ్యర్థులను కూడా ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. మరోవైపు జనసేన కూడా బలమైన అభ్యర్థులతో ఒకటీ రెండు రోజులలోనే అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఒక్కసారి అభ్యర్థుల జాబితా విడుదలైతే.. వైసీపీ టార్గెట్ గా తెలుగుదేశం, జనసేన కూటమి వేగం పెంచేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.