Publish Date:Jun 16, 2025
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం నేరుగా తెలంగాణ భవనం చేరుకోని మీడియా సమావేశం నిర్వహించారు. ఇది ఒక లొట్టపీసు కేసు అని, ముఖ్యమంత్రి ఓ లొట్టపీసు అని తీవ్ర స్ధాయిలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఒకటే షోకు. నేను నెల రోజులు జైలులో ఉన్న .. వీళ్లను కూడా కొన్నిరోజులు జైలుపెట్టాలి అన్నదే ఆయనకున్న షోకు, పైశాచిక ఆనందం ఒక్కటే అని కేటీఆర్ విమర్శించారు. అందుకే ఇవాళ అధికారులకు నేను చెప్పిన.. మీకు పై నుంచి ఆదేశాలు రావొచ్చు ఇప్పటికే.. వస్తే పెడితే జైలులో పెట్టుకొమ్మని చెప్పాను. పదిహేను రోజులు విశ్రాంతి తీసుకొని వస్తానని చెప్పాను.
ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. తప్పు చేయలేదు.. తలదించుకునే పని ఎంతమాత్రం చేయలేదని ఆయన తెలిపారు. ఈ ఫార్ములా కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగితే రేవంత్‌రెడ్డి పారిపోయిండని ఆయన అన్నారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుంటా.. నువ్వు రా రేవంత్‌కు సవాల్ విసిరారు. నాపై ఇప్పటి వరకు 14 కేసులు పెట్టారు. ఇంకో 1400 కేసులు పెట్టుకో.. అవసరమైతే జైలులో పెట్టుకో. ఏమన్న చేసుకో. భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినం. అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తే భయపడేటోడు ఎవడూ లేడు. నీ ఉడుత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడమని కేటీఆర్ మండిపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/formulae-car-case-25-200097.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.