అల్లు అస్సలూహించలేదు కదూ!?

Publish Date:Jul 11, 2025

Advertisement

 

నంద్యాల శిల్పం సైకిలెక్కనుందా? అన్న టాక్ వినిపిస్తోంది. కారణం.. ఆయన ఓడిపోయినప్పటి నుంచీ వైసీపీ అంటేనే చిన్న చూపు ఏర్పడిందట. అంతే కాదు.. ఎప్పుడో ఎక్కడో ఒక సారి పార్టీ ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారట. దీంతో నంద్యాలలో పార్టీ క్రమంగా పట్టు తప్పుతున్నట్టు ఇంటర్నల్ టాక్. దానికి తోడు ఆయన చూపు టీడీపీ వైపు మళ్లు తున్నట్టుగానూ భావిస్తున్నారట ఇక్కడ ఫ్యాను పార్టీ కార్యకర్తలు. ఇక్కడ అసలు మేటరేంటంటే.. ఈయనగారి ఈమాత్రం రాజకీయానికి అనవసరంగా వేలు పెట్టి లేని పోని గొడవకు కారణమయ్యాం కదాని తెగ ఫీలవుతున్నారట పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్. 

పుష్పరాజ్ గా ఫేమస్ అయిన దానికంటే.. నంద్యాల రవి కోసం ప్రచారానికి వెళ్లినపుడే ఎక్కువగా ట్రోల్ అయ్యారాయన. అంతేనా కుటుంబంలో లేని పోని గొడవలు. నానా యాగీ జరిగింది. నాగబాబు ట్వీట్ నుంచి మొదలు పెడితే.. మెగాహీరోల్లో సాయి ధరమ్ వంటి కొందరు హీరోలు అల్లువారబ్బాయిని అన్ ఫాలో చేయడం వంటి పరిణామక్రమాలు. ఆపై అల్లు అర్జున్ ఈ మొత్తం ఎపిసోడ్ పై వివరణ ఇచ్చుకోవల్సి రావడం.. ఇలా నానా రకాల రభస జరిగింది. ఏదో తన రెడ్డింటి భార్యామణి బంధువు కదాని.. వెళ్లినందుకు ఇంత హైరానా హంగామా జరిగాయి. ఇప్పుడవన్నీ బూడిదలో పోసిన పన్నీరా? అన్న క్వశ్చిన్ మార్క్ అల్లు అర్జున్ని తెగ డిస్ట్రబ్ చేస్తోందట. 

తాను సపోర్టుగా వెళ్లిన రవి చూస్తే కూటమి పార్టీలకే పెద్ద దిక్కయిన టీడీపీలోకి వెళ్లడమంటే ఇన్నాళ్ల పాటు తాను అనుభవించిన కష్టానికే అతి పెద్ద అవమానకరంగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఒక పక్క చూస్తే కుటుంబంలో కలహాలు. మరొక పక్క చూస్తే రాజకీయ కక్ష సాధింపుల్లాంటి ఘటనలు. ఎటు నుంచి ఎటు చూసినా.. నంద్యాల ఎపిసోడ్ నుంచి అల్లు అర్జున్ పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా రెండు వేల కోట్ల రూపాయల మేర వసూళ్లు చేసినా, తనకు నేషనల్- స్టేట్ అవార్డులు రెండొచ్చినా.. రవీ తీసిన ఈ ఎదురు దెబ్బ ముందు అవన్నీ తేలిపోయినట్టుగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఇది తాను అస్సలు ఊహించలేదట. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు. 

ఇంత పెద్ద సెలబ్రిటీ వెళ్లి కూడా అక్కడ రవి ఓడిపోయారు. ఇప్పుడు చూస్తే ఆయన పార్టీయే మారనున్నారు. అంటే, ఒకటికి రెండు దెబ్బలు. రవి కోసం నంద్యాలకు వెళ్లడంతో తనను వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నెత్తిన పెట్టుకుని చూసుకున్నాయి. ఈగ కూడా వాలనివ్వలేదు. మొన్నటికి మొన్న పవన్ అడవులను దోచేవాడు హీరో ఏంటన్న కామెంట్ల సమయంలో కూడా అల్లు అర్జున్నే వెనకేసుకొచ్చారు వీరంతా. దీనంతటికీ కారణమైన రవి ఒక వేళ టీడీపీలోకి వెళ్లిపోతే.. తాను కూడా ఆ పార్టీలోకి వెళ్లినట్టా? లేక ఫ్యాన్ పార్టీలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే కంటిన్యూ అవుతుందా? తేలాల్సి ఉందంటున్నారు అల్లు అర్జున్ ఆర్మీ.

By
en-us Political News

  
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇటు ఇండియా కూటమి, అటు ఎన్డీయే కూటమి కూడా తమ విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమి,ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశం ఉంది. అలాగే చిరాగ్ పాశ్వాన్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణంగా ఓట్లు చీలితే ప్రత్యర్ధి పార్టీకి దెబ్బ అని ఎన్నికల విశ్లేషకులు చెబుతారు. కాని పీకే పార్టీ అధికార పార్టీ ఓట్లనే చీల్చి దాన్నే డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు.
వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే నేష‌న‌ల్ హైవే బ్లాక్‌ అవుతుందని.. అలా జ‌రిగితే తమిళనాడులోని క‌రూరులో విజయ్‌ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ రోజు గానీ చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, దీంతో తాము జగన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చేది లేద‌ని సీపీ తెగేసి చెప్పారు.
స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడి నియోజ‌క‌వ‌ర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందనీ, ఆ విషయాన్ని తానే స్వయంగా నిరూపిస్తాననీ సవాల్ విసిరి మకవర పాలెం పర్యటకు రెడీ అయ్యారు. విశాఖ నుంచి 63 కిలోమీటర్లు రోడ్ షో ద్వారా మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీని సందర్శించేందుకు సమాయత్తమయ్యారు.
ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మ‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై రియాక్ట‌యిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధారాల‌తో స‌హా కంప్ల‌యింట్ చేయాల‌ని రాహుల్ కి సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు తగవని వారించారు. తాను ప్ర‌త్యేకించీ ఆధారాలు చూపించ‌న‌క్క‌ర్లేద‌నీ.. త‌న ప్రెజంటేష‌న్లు తీసుకుని వాటిపై మీరు స్పందించాలంటూ కౌంటర్ ఇచ్చారు రాహుల్.
ఈ నెల 27 నుంచి న్యూయార్క్ లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశానికి హాజరయ్యే భారత ఎంపీల బృందాన్ని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వం వహించే ఈ బృందంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చోటు దక్కింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.
బిహార్‌లో ఎన్నికలపై మ్యాటిజ్-ఐఎఎఎన్ఎస్ పబ్లిక్ ఒపినియన్ పోల్‌ సంచలన సర్వేపోల్‌ వెల్లడించింది.
జూబ్లీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ మరణించడం వల్ల అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన సతీమణి మాగంట సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ కూడా జూబ్లీ ఉపఎన్నికలో విజయంతో ప్రభుత్వంపై ప్రజలలో సానుకూలత ఉందని నిరూపించాలని భావిస్తోంది.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
స్టే ఇవ్వకుంటే పిటిషన్ వేస్తారా అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. హైకోర్టులో విచారణలో ఉన్న అంశంపై తాము విచారణ జరపజాలమని స్పష్టం చేసింది. గతంలో ఇదే పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విజయ్ కు ఫోన్ చేసి మద్దతు పలికారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దీనిపై డీఎంకేలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వాస్తవానికి విజయ్ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు తమకు రాజకీయ శత్రువులు అని విజయ్ గతంలోనే ప్రకటించారు. బీజేపీ పట్ల ఒకింత సాఫ్ట్ కార్నర్ చూపుతూ కాంగ్రెస్, డీఎంకేలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
చట్టం ముందు అందరూ సమానమే అని చాటిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని వారు స్వాగతిస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.