మొన్న క్విడ్ ప్రోకో..ఇవాళ కిక్ బ్యాక్స్..జగన్ చిక్కే ఛాన్సెంత?
Publish Date:Jul 22, 2025

Advertisement
జగన్ స్టైలే వేరబ్బా. చాలా మంది చంద్రబాబే సంపద సృష్టిలో టాప్ అంటారుగానీ అదంతా ఉట్టిది. ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. అదే సొంతంగా సంపాదించడంలో జగన్ తర్వాతే ఎవరైనా. గతంలో తండ్రి అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా భారీ ఎత్తున అవినీతికి తెరలేపారా? అదే ఇప్పుడు మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న కొత్త పదజాలం.. కిక్ బ్యాక్స్. ఈ కిక్ బ్యాక్స్ ఇప్పుడు కరప్షన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి వరకూ ఏ1 టు ఏ 38 ఒక సిండికేట్ గా ఏర్పడి.. వీరు చేసిన విధ్వంసం విలువ 3500 కోట్లు. ఈ మొత్తం నాలుగైదు చేతులు మారి ఫైనల్ గా చేరింది జగన్ కే అంటారు. ఛార్జ్ షీట్ లో కూడా జగన్ పేరు ప్రముఖంగానే ప్రస్తావించారు. అయితే జగన్ కి చేరినట్టు గల ఆధారాలు సంపాదించడం అంత తేలికేనా? అన్నదొక ప్రశ్న.
గతంలో కూడా జగన్ ఇలాగే.. క్విడ్ కో ప్రో ద్వారా ఎవరికీ చిక్కకుండా చేసిన హడావిడి హంగామా పత్రికల్లో కనిపించింది తప్ప.. పెద్ద గొప్పగా జగన్ ఇరుక్కున్నదేం లేదు. పైపెచ్చు లక్ష కోట్లని చెప్పి చివరికి తేల్చింది 12 వందల కోట్లకన్నా మించి లేదు. దానికి తోడు అవన్నీ కూడా తండ్రి హయాంలో జరిగినవి. కాబట్టి ఇవేవీ పెద్ద నిలబడే కేసులు కావన్న కోణంలో ఉండవల్లి లాంటి వారినోటి నుంచి వినవచ్చిందీ వినే ఉంటాం.
ఇపుడీ లిక్కర్ కేసు పరిస్థితేంటి? అన్నదొక చర్చ. ఇందులో పెద్ద పెద్ద తిమింగలాలు బయట పడతాయి, ప్రపంచంలో అతి పెద్ద మద్యం కేసు అని మంత్రి కొల్లు చెబుతున్నారుగానీ.. అతి పెద్ద తిమింగలం ఎవరు? ఆ తిమింగలాన్ని ఎలా అరెస్టు చేస్తారంటే అందుకు తగిన ఆధారాలున్నట్టే కనిపించడం లేదు.
రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి వరకూ సాగించిన ఈ లిక్కర్ లీలలో సొమ్మంతా జగన్ కి చేరినట్టు చెబుతున్నారు కానీ అందుకు తగిన ఆధారాలు కేవలం నోటిమాటలుగానే తెలుస్తున్నాయి. ఈ వాంగ్మూలాలతో జగన్ ని బుక్ చేయడం అంటే సాధ్యమయ్యే పనేనా? అన్నది మరొక ప్రశ్న.
జగన్ ఎప్పుడూ తన వైపు తప్పు ఉండేలా చేసుకోరు. అది క్విడ్ ప్రో కోలో అయినా, కిక్ బ్యాక్స్ వ్యవహారంలో అయినా. ఎవరెంత మొత్తుకున్నా.. ఆయనకంటూ ఒక లూప్ హోల్ పెట్టుకుని అందులోంచి తప్పించుకోవడం తనదైన కరెప్షన్ స్టైల్. కాబట్టి ఆ తిమింగలం అంత తేలిగ్గా చిక్కేది కాదని అంటారు కొందరు న్యాయనిపుణులు.
http://www.teluguone.com/news/content/former-mla-chevireddy-bhaskar-reddy-39-202486.html












