మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై ఈఓడబ్ల్యూ ఫోకస్

Publish Date:Jun 17, 2026

Advertisement

 

గండిపేటలోని విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాల ఆధారంగా కాజేసేందుకు కుట్ర జరిగినట్లు ఆరోపణలు ఉన్న ఈ కేసులో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, గండిపేట సర్వే నంబర్-18లోని 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలు, నకిలీ ప్రభుత్వ పత్రాల ఆధారంగా ప్రైవేట్ ఆస్తిగా చూపించి ఆక్రమించేందుకు కుట్ర జరిగినట్లు గుర్తించారు.

 ప్రస్తుతం ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బొల్ల బ్రహ్మనాయుడిని జూన్ 5న తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం హైదరాబాద్‌కు తరలించి చంచల్‌గూడ జైలుకు పంపించారు. కోర్టు అనుమతితో ప్రస్తుతం ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భూమి వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూమి డీల్ కోసం సుమారు రూ.12 కోట్లు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించగా, అందులో బొల్ల బ్రహ్మనాయుడు వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ.1.25 కోట్లు బదిలీ అయినట్లు ఆర్థిక లావాదేవీల ఆధారాలు సూచిస్తున్నాయి.

నకిలీ జీవోలను ఎవరు రూపొందించారు? ప్రభుత్వ రికార్డుల్లో వాటిని చేర్చేందుకు ఎవరు సహకరించారు? ఈ వ్యవహారం వెనుక మరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై ఈఓడబ్ల్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నకిలీ పత్రాలు తయారు చేసిన వ్యక్తుల పాత్రపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.ఇప్పటికే పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని విశ్లేషిస్తున్నారు. బొల్ల బ్రహ్మనాయుడు ఇచ్చే సమాచారంతో మరికొందరు సహనిందితుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవసరమైతే మరిన్ని అరెస్టులు కూడా ఉండవచ్చని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో కస్టడీ విచారణ పూర్తయ్యేలోపు మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

By
en-us Political News

  
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
ప్రతీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ...
కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకార సంఘాలకు కీలక సూచనలు చేశారు
క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్‌లకు నోటీసులు పంపిన TCA..
హైదరాబాద్‌ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
జూన్ 17 వచ్చినా దేశంలోని చాలా ప్రాంతాలలో వేసవి వాతావరణమే నెలకొని ఉంది. చురుకుగా కదలాల్సిన నైరుతి రుతుపవనాలు మందగించాయి. సాథారణంగా జూన్ 17 నాటికి దేశ వ్యాప్తంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 39.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.
భారత్ మరియు అఫ్గానిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం సరికొత్త మలుపు తిరిగింది.
నిరంజన్ ను చూసేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ ఆతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం అన్న నిరంజన్ మాటలకు పవన్ కదిలిపోయారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.
ర్యాగింగ్ సంఘటనకు సంబంధించి  ప్రభుత్వ డెంటల్ కాలేజీకి చెందిన 12 మంది ఫైనల్ ఇయర్ సీనియర్ విద్యార్థులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బాధితులు,  ప్రస్తుతం మొదటి సంవత్సరం  బీడీఎస్  చదువుతున్నారు. ప్రభుత్వ డెంటల్ కాలేజీ విద్యార్థులు నివసిస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలోనే ఈ  ర్యాగింగ్ జరిగింది.
మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా వచ్చిన ప్రతిపాదనలను, నివేదికలను పరిశీలించింది. బుధవారం జరిగే భేటీలో అధికారుల అభిప్రాయాలను సేకరించి, భవనాల వాడకంపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం.. వచ్చే కేబినెట్ మీటింగ్‌లోనే కమిటీ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పార్క్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. అనంతరం పార్క్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. సెల్ఫీలు తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.