వరద గుప్పిట్లోనే తెలుగు రాష్ట్రాలు

Publish Date:Sep 30, 2025

Advertisement

తెలుగు రాష్ట్రాలను వర్షాలూ వదలడం లేదు. వరదా విడవడం లేదు. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని అనుకునే లోగానే.. ఉత్తరాంధ్ర పరిసరప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం ప్రభావంతో అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా ఉండగా, కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.  సోమవారం సాయంత్రానికి  ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.61,960 క్యూసెక్కులుగా ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఇక గోదావరికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 45,70 అడుగులు ఉండగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 9 లక్షల 71 వేల 784 క్యూసెక్కులు ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ఇక్కడ కూడా వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.బుధవారం నాటికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 12 నుంచి 12,5 క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.  వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో   
సహాయక చర్యల కోసంఎన్డీఆర్ఎఫ్,  ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.  

By
en-us Political News

  
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతం అపారమైన సహజ వనరులకు, అరుదైన ఖనిజాలకు నిలయంగా మారింది.
అయోధ్య రామాలయం, విరాళాల వివాదం, రాముడి నిధుల దుర్వినియోగం, సిట్ విచారణ, యోగి ఆదిత్యనాథ్
శిల్పాకళా వేదికగా రైతు భరోసా నిధులు విడుదల...
దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే అద్భుత లక్ష్య సాధనలో నవతరానికి చెందిన యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి అత్యవసరంగా సమావేశం కానుంది.
విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది
పుష్ప సినిమాను తలపించే రీతిలో కంటైనర్ లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయి
ఈ వివాదానికి కారణం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలే. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులని, వాళ్లు దక్షిణాదిపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుత తరుణంలో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.