Publish Date:Jul 20, 2022
పల్లెలంటేనే ఓ అందం. అందులో ఆంధ్రాలో కోనసీమ మరీ అందం. ఈ ఊరూ .. ఈ గాలి.. సెలయేరూ.. అంటూ తెలుగు వాళ్లు నేలకు ఓ అడుగు ఎత్తునే ఆనందంలో తేలియాడుతారు.. హిందీవాళ్లయితే గోరీ తేరా గావ్ బడా ప్యారా.. మైతో గయా హారా ఆకే యహారే..! అంటూ ఓలలాడతారు. కోనసీమ అనగానే ముం దుగా వచ్చే మాట కొబ్బరిముక్క, కొబ్బరి నీళ్లు... ఎవర్ని కదిలించినా.. కొబ్బరి నీళ్ల మగిమ.. మరి.. అంటా రు. అసలు కోనసీమంటే మరో కేరళతో సమానం. అదంతెహె! అని కాస్తంత ఆనందం పెల్లు బికిన గర్వంతో కూడిన ప్రేమతో పలకరించడం సదా ఆకట్టుకుంటుంది. ప్రకృతి అందాలు అంటే ఛండాలంగా అసహ్యమైన ఫ్రేముల్లో ఇళ్లలో పెట్టుకునే పెయింటింగ్ బొమ్మలు కాదు.
ప్రతీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉన్నట్టే కోనసీమ ప్రత్యేకత కొబ్బరి అన్నాం గదా. కానీ ఇటీవలి ప్రకృతి వైప రీత్యాలతో కొబ్బరి రైతు విలవిలలాడుతున్నాడు. వరద రూపం లో గోదావరి విలయ తాండవానికి వరద ప్రభావిత ప్రాంత ప్రజలు ఒక పక్క ఆకలి కేకలు,మరో పక్క సహాయక చర్యలు అందక ఇబ్బందులు పడు తుంటే,మరో పక్క కొబ్బరి చెట్లు నీట మునిగి కాపు రాక రైతులు రోదిస్తున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు, పాశర్ల పూడి గ్రామాలలో పాటు మరి కొన్ని చోట్ల కొబ్బరి రైతులు వరద నష్టం పై ఆందోళన చెందుతున్నారు.
ఈ జులై కోనసీమ అందాన్ని చిందరవందర చేసింది. ముఖ్యంగా వరదల వల్ల కొబ్బరి నేల రాలి పోవడంతో కోట్లలో నష్టం వచిందని వ్యాపారాలు గోల పెడుతున్నారు. కొబ్బరి కాయలు పూర్తిగా తడిసి పోయాయని, తొమ్మిది రూపాయలు పలికే ది కనీసం రెండు రూపాయలు పలకడం లేదని వాపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో వరదలు వచ్చాయి అని, దాని వల్ల చాలా నష్టపోయాం అని చెప్తున్నారు.వరద నీటి లో తడిసి కొబ్బరి కాయలు కుళ్ళిపోయి ఎందుకూ పనికి రాకుండా పోయాయని కన్నీరు పెట్టుకుంటున్నా రు. కోనసీమ నుంచి దేశం నలుమూలలకి కొబ్బరి ఎగుమతులు వున్నాయి.
అలాంటి కొబ్బరి కాయలు కుళ్ళి ఎగుమతికి పనికి రాకుండా పోయింది అని రోదిస్తున్నారు. ప్రభుత్వం తగిన సహాయం చేయాలనీ రైతులు అభ్యర్ధిస్తున్నారు. లంక గ్రామాలలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. లంక గ్రామాల్లో వరదలు తీవ్ర నష్టా న్ని మిగిల్చాయి. వరద ముంచెత్తడంతో పంటలన్నీ నాశనమయ్యాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. లంక గ్రామల్లో దాదాపు వేల ఎకారాల్లో పంట నీటిలో మునిగిపోయింది. ఈ వరదల కారణంగా కోట్ల రూపా యిల్లో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవా లని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/floods-broughy-huge-loss-to-konaseema-coconut-39-140150.html
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.